వార్నీ.. దేవర కోసం ముందు అనుకున్న టైటిల్ అదా..? ఎందుకు పెట్టలేదు అంటే..?

ఈ మధ్యకాలంలో డైరెక్టర్ బాగా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే సినిమాల విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఎంతలా అంటే సినిమాలు తెరకెక్కించడం మాత్రమే కాదు. ఒక సినిమాని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి ..?ఎలా ప్రమోట్ చేసుకోవాలి..? తమ సినిమాలకు ఎలాంటి హైప్ క్రియేట్ చేయాలి అన్న విషయం బాగా బాగా ఫాలో అవుతున్నారు .

మరి ముఖ్యంగా సినిమా టైటిల్ పై చాలా చాలా స్పెషల్ ఫోకస్ ఇస్తున్నారు. టైటిల్ లో క్యాచీ పదాలు ఉన్న.. కంటెంట్ లీక్ కాకుండా తికమకగా అయోమయంగా ఉండే టైటిల్స్ పెట్టిన జనాలకు చాలా డిఫరెంట్ గా నచ్చేస్తుంది . అయితే అన్ని సినిమాలకు అలా టైటిల్స్ పెట్టలేము. అది అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలకు చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి . తాజాగా సోషల్ మీడియాలో “దేవర” సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఈ సినిమాకి ముందుగా “నాయర్” అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారట కొరటాల . ఎన్టీఆర్ టైటిల్ విని సినిమా కథకు నాయర్ అనే టైటిల్ కు అంతగా సూట్ అవ్వదు అంటూ సజెస్ట్ చేశారట. ఇదే క్రమంలో కొత్త టైటిల్స్ కోసం ఆలోచిస్తూ ఉండగా పలు పేర్లను ప్రస్తావించగా లక్ష్మీ ప్రణతి .. దేవర అనే టైటిల్ ఓకే చేసిందట . ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు . దేవ్-వరా అనే రెండు పాత్రలో మెప్పించబోతున్నాడు..!!