ఒంగోలు వైసీపీలో ముసలం పుట్టింది… సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే గన్‌మెన్‌లను సరెండర్ చేసిన బాలినేని తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డితో భేటీ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు. సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే తాడేపల్లి చేరుకున్న బాలినేని సాయంత్రం […]
Tag: YCP
పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు […]
రూరల్‌లో వైసీపీ ‘రూల్’..మళ్ళీ తిరుగులేదా?
అధికార వైసీపీ ఇప్పుడు ఏపీలో అత్యంత బలమైన రాజకీయ పార్టీగా ఉంది. ప్రస్తుతం సర్వేలు చూస్తే వైసీపీదే ఆధిక్యం కనిపిస్తుంది. అయితే వైసీపీ గత ఎన్నికల్లో అన్నీ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ కాస్త వెనుకబడుతుందని తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో టిడిపి బలంగా కనబడుతోంది. అర్బన్ , సెమీ అర్బన్ ప్రాంతాల్లో టిడిపికి బలమైన ఓటింగ్ ఉంది. అయితే రూరల్ లో మాత్రం వైసీపీ పూర్తి ఆధిక్యం కనబరుస్తోంది. అందులో […]
టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..ఆ మీడియా టార్గెట్.!
టీడీపీ-జనసేన పొత్తు ఎంతవరకు వైసీపీని దెబ్బకొడుతుందో తెలియదు గాని..పైకి పొత్తు వల్ల తమకు నష్టం లేదని వైసీపీ నేతలు అంటున్నారు..కానీ లోలోపల మాత్రం ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి దాదాపు చాలా సీట్లలో వైసీపీకి లాభం జరిగింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది. అందులో 50 సీట్లు కేవలం ఓట్ల చీలిక వల్లే గెలిచిందని చెప్పవచ్చు. అందుకే ఈ సారి వైసీపీకి ఛాన్స్ […]
బాబు కేసులో మలుపులు..సీన్ రివర్స్.!
చంద్రబాబు కేసుల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాబుకు అనుకూలంగా ఎలాంటి తీర్పులు రావడం లేదు. దీంతో టిడిపి శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయన కోసం టిడిపి శ్రేణులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ అనుకున్న విధంగా మాత్రం పోరాటం ఫలించడం లేదు. అటు కోర్టుల్లో బాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అటు సిఐడి కస్టడీలో 2 రోజుల పాటు విచారించి..మళ్ళీ అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు. […]
పల్లెబాట..వైసీపీ భారీ స్కెచ్.!
ఒకే ఒక దెబ్బతో టిడిపి కార్యక్రమాలకు బ్రేకులు పడిపోయాయి.ప్రజల్లోకి వెళ్ళడం లేదు. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు..టిడిపి నేతలు ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేస్తున్నారు. బాబు సైతం రోడ్ షోలు, సభలతో బిజీగా ఉన్నారు. అటు లోకేష్ యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్నారు. ఇలా టిడిపి..వైసీపీ టార్గెట్ గా రాజకీయం చేస్తుంది. కానీ బాబు అరెస్ట్ తో టిడిపి మొత్తం ఇప్పుడు బాబు ఎప్పుడు బయటకొస్తారా? అని ఎదుచూస్తున్నారు. ఇదే సమయంలో బాబుపై వరుస కేసులు..ఇప్పుడే బయటకొచ్చే […]
ఎమ్మెల్యేలే టీడీపీకి డ్యామేజ్..ప్లాన్ రివర్స్.!
టీడీపీ నేతలే..టీడీపీకి డ్యామేజ్ చేస్తున్నారా? చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఓ వ్యూహం లేకుండా ముందుకెళ్లడంతో టిడిపి నేతలు ఫెయిల్ అవుతున్నారా? వైసీపీ ఎత్తుల ముందు తేలిపోతున్నారా? అంటే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు చేసిన కార్యక్రమం చూస్తే అవుననే అనిపిస్తుంది. అసలు అసెంబ్లీలో చర్చ జరగకుండా బాబు అక్రమ అరెస్ట్ అంటూ ప్లకార్డులు పట్టుకుని పోడియం ముందుకెళ్లి హడావిడి చేయడం, అక్కడ స్పీకర్‌ని ఇబ్బంది పెట్టడం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ లాంటి […]
ఏపీ ప్రతిపక్షాల్లో వారి కొరతే ఎక్కువ…!
ఏపీ విపక్ష పార్టీలను ఓ అంశం తీవ్రంగా వేధిస్తోంది. ఆశ్చర్యకరంగా టీడీపీ, జనసేన, బీజేపీని ఒకే మ్యాటర్ వేధిస్తోంది. అందుకే… వాయిస్ మార్చడానికి ఆయా పార్టీలు దృష్టి పెట్టాయి. ఇంతకీ ముచ్చటగా మూడు పార్టీలను ఇబ్బంది పెడుతున్న అంశం ఏమిటనుకుంటున్నారా.. కేవలం మహిళా నేతలు మాత్రమే. మూడు పార్టీల్లో ఇప్పుడు మహిళా నేతల కోరత కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోంది. మహిళా నేతలు కావలెను…. ఏపీలోని మూడు ప్రధాన పార్టీల్లో వినిపిస్తున్న మాట ఇదే. అవును.. ఇప్పుడు టీడీపీ, జనసేన, […]
అసెంబ్లీలో జగన్ బిగ్ ప్లాన్..టీడీపీ అవుట్?
చంద్రబాబు అరెస్ట్, ఎన్నికల సమయం దగ్గరపడటం, టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవ్వడం, రాజకీయంగా పైచేయి సాధించి మళ్ళీ ప్రజల మద్ధతు గెలవాలని చూస్తున్న జగన్..ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. బాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో..ప్రభుత్వం కక్ష సాధించడం లేదని, తప్పు చేసి జైలుకు వెళ్లారని నిరూపించే విధంగా జగన్..అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఈ సమావేశాలు టిడిపి హాజరు అవుతుందా? లేదా? అనేది పెద్ద చర్చగా మారింది. […]