జగన్ పై జరిగిన దాడి గురించి స్పందించిన హీరో విశాల్.. కుట్ర కోణం దాగి ఉందంటూ కామెంట్స్..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తున్నానని తమిళ్ స్టార్ హీరో నిశాల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు ముందే విశాల్ ఏపీ ఎలక్షన్స్ లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు నడిచాయి. కానీ దీనిపై ఈయన ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తాను ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఏపీ పాలిటిక్స్ లోకి మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన విషయంపై హీరో . విశాల్ తనదైన శైలిలో స్పందించాడు. సీఎం జగన్ పై జరిగిన దాడిలో కుట్ర కోణం దాగి ఉందన్నారు. కావాలనే ఈయనపై దాడి చేయించినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశాడు.

గతంలోనూ జగన్ పై కోడి కత్తితో దాడి చేశారని గుర్తు చేశాడు. జగన్ రాయలసీమ బిడ్డ అని ..పులివెందులలో పుట్టిన ఆయన ఎలాంటి దాడులకు భయపడడని చెప్పుకొచ్చాడు. తను జగన్ కు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.