నాగచైతన్య ‘ తండేల్ ‘ మూవీ నయా రిలీజ్ డేట్ ఇదే.. ఆ పండుగకు సర్ప్రైజ్..

అక్కినేని మూడోతరం వారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అయితే ఊహించిన రేంజ్ లో చైతుకు స్టార్‌డం రాకపోయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండెల్ మూవీలో చైతూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుంది అంటూ మొదట వార్తలు వినిపించాయి. అయితే తాజాగా దసరా సందర్భంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు షెడ్యూల్ అవ్వడంతో.. మరోసారి తండేల్ మూవీ రిలీజ్ డేట్ ను మార్చారని.. డిసెంబర్ నెల 20వ తేదీన క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్‌ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Naga Chaitanya unveils intriguing poster from his upcoming movie 'Thandel'

ఇక చైతు తండ్రి టాలీవుడ్ కింగ్ నాగార్జునకు డిసెంబర్ ల‌క్కి మంత్ అన్న‌ సంగతి తెలిసిందే. ఈ నెలలో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో తండేల్‌ మూవీ కూడా డిసెంబర్లో రిలీజ్ అయితే.. తండ్రి సెంటిమెంట్ చైతుకి కూడా వర్కౌట్ అవుతుంది ఏమో చూడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం నాగచైతన్య మార్కెట్ అంతంతమాత్రంగానే ఉంది. అయితే తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే మాత్రం ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా మూవీగా రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. నాగచైతన్య కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.

Thandel Teaser Out: Naga Chaitanya-Sai Pallavi Promise A Gripping Patriotic Drama

డైరెక్టర్ చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. చైతన్య ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నారు. నిజ జీవిత గాధ‌ ఆధారంగా ఈ సినిమా రావ‌డం.. అలాగే సాయి పల్లవి హీరోయిన్ కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. శ్రీకాకుళం యాసలో చైతన్య డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో వేరే లెవెల్ లో ఉండనుందని టాక్. అయ‌తే ఈ తండేల్‌ సినిమాతో అమాంతం ఆయన రేంజ్ పెరిగిపోవడం ఖాయం అంటూ.. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధిస్తాడంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.