వెరీ ఇంట్రెస్టింగ్: ఇండస్ట్రీలో బికినీ ధరించిన మొదటి హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇప్పుడంటే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ బికినీ వస్తుంది. అసలు ఇండస్ట్రీలోకి రాని ముద్దుగుమ్మలు కూడా చిట్టిపొట్టి బట్టలతో కుర్రాళ్లను బాగా టెంప్ట్ చేసేస్తున్నారు . అయితే ఇది ఇప్పుడు పరిస్థితి . ఒకప్పటి పరిస్థితి ఇలా లేదు .. ఒకప్పుడు చీర కొంగు జారితేనే గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయేవారు . అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు . అయితే ఇండస్ట్రీలో అసలు బికినీ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన హీరోయిన్ ఎవరు అనే విషయం ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో ఫస్ట్ టైం బికినీ వేసిన హీరోయిన్ నళిని జయవంత్ . ఈమె గురించి ఇప్పటి జనాలకి పెద్దగా తెలియకపోవచ్చు . 20వ శతాబ్దం మధ్యకాలంలో హిందీ చిత్రాలలో ఒక ఊపు ఊపేసింది . ముంబైలో పుట్టిన నళిని 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ రోజుల్లో ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది . అది ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే అవలీలగా నటించేసి మెప్పించేసేది.

అప్పట్లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందరూ డైరెక్టర్ హీరోస్ నళీని వెంటే పడేవారు. దానికి కారణం ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత నాజూకుగా సున్నితంగా ఉంటుంది ఆమె అందం. ఇండస్ట్రీలో మొదట స్వీమ్ సూట్ ధరించిన హీరోయిన్ నళిని . 1950లో రిలీజ్ అయిన సంగ్రామ్ అనే చిత్రంలో ఫస్ట్ టైం నళిని జయంత్ స్విమ్ సూట్ ధరించి తెరపై కనిపించారు. అప్పట్లో ఆమె బికినీ ఫోటోలు ప్రేక్షకులను షాకింగ్ కి గురిచేసాయి . చక్కగా చీర కట్టుకొని మెప్పించిన నళిని ఇలా పొట్టి బట్టల్లో కూడా మెరవడం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే అంత క్రేజ్ సంపాదించుకున్న నళిని ఆఖరి రోజుల్లో ఎలా మరణించింది అనే విషయం అందరికీ తెలిసిందే..!!