జగన్ ఓడిపోబోతున్నాడు అని ముందే గ్రహించాడా..? అందుకే ఆ పని కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నాడా..?

ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ హాట్ సిచువేషన్ నెలకొన్నాయో మనకు తెలిసిందే . ఇన్నాళ్లు రాజ్యం ఏలేసిన అధికార పార్టీ త్వరలోనే టఫ్ సిచువేషన్ ఫేస్ చేయబోతుంది అంటూ జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం రాజ్యం దిగుతారా..? కొత్త రాజ్యాన్ని సృష్టించబోతున్నారా ..? తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అంటూ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ..మరి కొంతమంది మెసేజెస్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఏపీలో చాలా చాలా పోల్స్ కండక్ట్ చేసి ఏ పార్టీ గెలవబోతుంది అనే విషయాలను ఓపెన్ గా చెప్పేశారు పలు మీడియా సంస్ధలు.

కాగా చాలామంది ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది అని టిడిపి – బిజెపి – జనసేన కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఈసారి ఎక్కువగా టిడిపినే అధికారం చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉన్న వైసిపి ఖచ్చితంగా టఫ్ సిచువేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చారు. కాగా మరి కొంతమంది ఏకంగా ఈసారి జగన్ ఓడిపోవడం పక్క అని ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అని.. అందుకే ఓడిపోయిన తర్వాత ఆ సిచువేషన్ ని ఎలా డీల్ చేయాలి అనే విషయంపై కూడా పక్కా ప్రణాళికను ముందు సర్వం సిద్ధం చేసుకున్నాడు అని సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు .

అంతేకాదు ఎలక్షన్స్ అయిపోయిన పక్క రోజే జగన్ తన భార్య తో లండన్ బయలుదేరి వెళ్లబోతున్నారు . అక్కడ కొన్ని రోజులు తన కూతురు తో గడిపిన తర్వాత తన ఇంకొక కూతురు దగ్గరికి అమెరికా వెళ్లి మరికొన్ని రోజులు గడపబోతున్నారు . సరిగ్గా ఎలక్షన్స్ కౌంటింగ్ ముందు రోజు ఇండియాలో ల్యాండ్ కాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు జగన్ ఓడిపోయిన కూడా ఆ విషయాన్ని చాలా హుందాగా తీసుకొని నెక్స్ట్ రాజకీయాలలో ఫార్వర్డ్ స్టెప్ ఏం చేయాలి ..? అనే విషయంపై పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు అంటూ కూడా ఒక టాక్ వినిపిస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!