ఆయన ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతోనే అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటించాడా..? సంచలనంగా మారిన మెగా లీక్డ్ న్యూస్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..టాలీవుడ్ సర్కిల్స్లో ..సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాల కన్నా ఎక్కువగా కూడా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు సినీ ప్రముఖులు. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ . ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు ..ఓ రేంజ్ లో దున్నేశాడు. ఇప్పుడు టైం రాజకీయాలపై పెట్టాడు . ప్రజాసేవ చేయాలి అనే కోరికతో రాజకీయాల్లో అడుగుపెట్టాడు . కాగా త్వరలోనే జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు . ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విధివిధానాలు నచ్చిన పలువురు స్టార్ డైరెక్టర్ లు..ప్రొడ్యూసర్స్ ..నటులు ..హీరోలు ..హీరోయిన్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు .

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలైన చిరంజీవి – చరణ్ – వరుణ్ తేజ్ – సాయి ధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశారు. కాగా మరొకపక్క పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్న హీరోలు నాని – రాజ్ తరుణ్ – నరేష్ – తేజ సజ్జా మరికొంతమంది హీరోలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాము అని ఏపీ రాజకీయ భవిష్యత్తు మారబోతుంది అని ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు తెలిపారు. రీసెంట్ గానే అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నట్టు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ ఎలక్షన్స్ కి సరిగ్గా మూడు రోజులు ముందు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఒక బడా పెద్ద వ్యక్తి కాల్ చేసి అల్లు ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వడంతోనే అల్లు అర్జున్ కూడా ఒక మెట్టు దిగి వచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అని.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలి అని ఉన్న పాలిటిక్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నాడు అని ..తీరా ఆ పెద్దమనిషి కాల్ చేసి పరోక్షకంగా బ్లాక్మెయిల్ చేసి వార్నింగ్ ఇవ్వడంతోనే అల్లు అర్జున్ .. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అని ప్రచారం జరుగుతుంది . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాలలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!