ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయళ్ళు.. ఏ పార్టీ రేట్ ఎంతో తెలుసా..? అధికారం చేపట్టబోయేది ఎవరంటే..?

ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు గత కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో వినిపించే ఒకే ఒక్క పదం రాజకీయాలు . అంతకుముందు పెద్దగా జనాలు పట్టించుకోని రాజకీయాలను ఇప్పుడు ప్రత్యేకంగా పట్టించుకోవడానికి కారణం ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఒక సినీస్టార్ సీఎం అవ్వడం మనం ఆల్రెడీ చూసాం . సీఎం అయితే ఎలాంటి పనులు చేస్తాడు ..ఒక సీఎం అనేది కూడా మనకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసి చూపించారు. అయితే ఇప్పుడు ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి సిద్ధంగా సిద్ధమవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ జనసేన పార్టీ నేతలు జనసైనికులు ముందుగానే పవన్ కళ్యాణ్ విజయాన్ని అంచనా వేసేస్తున్నారు.

కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . జూన్లో ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ బయటపడుతుంది . ఏపీ తలరాతను మార్చే టైం దగ్గరకు వచ్చేసింది అంటున్నారు జనసైనికులు . ఇన్నాళ్లు కష్టపడిన వాళ్లందరూ కూడా కళ్ళు తెరిచి మేల్కొని ఎవరికి ఓటు వేయాలో ఆలోచించండి ..ఎవరికి ఓటు వేస్తే మనకి మేలు జరుగుతుందో బాగా ఆలోచించి ఓటు వేయండి అంటూ ప్రోత్సహిస్తున్నారు. కాగా ఈసారి టిడిపి-బిజెపి-జనసేన ఒక్కటిగా పోటీ చేస్తుంది. దీంతో అధికార పార్టీకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది అంటున్నారు పోల్స్.

అంతేకాదు పలు సర్వేలలో ఇప్పటికే టిడిపి – జనసేన విజయం సాధిస్తుంది అంటూ కూడా రిజల్ట్ బయటపడింది . అయితే వైసిపి కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అని వైసిపికి ఆ బలం బలగం ఎక్కువగా ఉంది అని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ఇదే మూమెంట్ ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు బెట్టింగ్ రాయళ్లు.. ఏపీలో ఏ పార్టీ విన్ అవ్వబోతుంది..? నెక్స్ట్ సీఎం ఎవరు..? అంటూ బెటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా కోట్లలోనే బెట్టింగ్స్ పెట్టుకుంటున్నారు . దీంతో ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఏపీ ఎన్నికలపై పడ్డాయి . చూద్దాం మరి ఏపీ తలరాతను మార్చే నాయకుడు ఎవరో..? అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియబోతుంది..!