ఓటికి డబ్బు ఇచ్చేవాడు వెధవ అయినప్పుడు.. తీసుకునే వాడిని ఏమని పిలవాలి..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు అనుకున్న విషయాన్ని తమ ఒపీనియన్ ని ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది యువత అయితే ఉన్న విషయాన్ని క్లియర్గా జనాలతో పంచుకోవడానికి తమకు తెలిసిన నాలెడ్జ్ ను మంచి విషయాన్ని నలుగురికి తెలియజేస్తున్నారు. అఫ్కోర్స్ సోషల్ మీడియాలో ఇది ఒక బిగ్ మంచి అంశం అనే చెప్పాలి . కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా లో ఏపీ రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు . ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు వేరు.. ఇకపై జరగబోయే రాజకీయాలు వేరు అంటూ యువత స్ట్రాంగ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తుంది .

కాగా మరీ ముఖ్యంగా ఇప్పుడు టిడిపి – బిజెపి -జనసేన ఒక్కటిగా పోటీ చేస్తూ ఉండడంతో బాగా బలంగా గట్టి కాంపిటీషన్ అధికార పార్టీకి ఇవ్వబోతుంది అంటున్నారు జనాలు. కాగా మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా ఇండియాలో వైరస్ల ఒక మహమ్మారి పట్టిపీడిస్తూనే ఉంటుంది అని జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . అదే ఓటుకు డబ్బు. ఓటు అనేది హక్కు . మనకి సరైన నాయకుడు ఎవరు అని ఎంచుకోవడానికి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అది ఏ కారణం చేత అయినా కావచ్చు .

మరీ ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు ఓటును నోట్ తో కొనుక్కుంటూ ఉంటారు. అయితే మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు కావుబోతు ఉండడంతో సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది పలానా పార్టీకి ఓటు వేసి.. పలన వ్యక్తిని గెలిపించండి అంటూ చెబుతూ ఉంటే . మరి కొంతమంది సరైన నాయకుడిని ఎంచుకునే సమయం వచ్చింది. ఏపీ భవిష్యత్తు మార్చే టైం దగ్గర పడింది అంటున్నారు.

అయితే ఇలాంటి మూమెంట్లోనే ఓటుకి డబ్బు ఇచ్చేవాడిని వెధవ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు జనాలు. అయితే అదే ఓటుకి డబ్బు తీసుకొని ఓటు వేసే వాడిని ఏం అనాలి..? అంటూ కొంతమంది తిరిగి ప్రశ్నిస్తున్నారు.. నేటి యువత టూ ఆక్టివ్ గా సోషల్ మీడియాలో రాజకీయాలపై అవగాహన కల్పిస్తుంది . ఏ రాజకీయ నాయకుడికి ఓటు వేయాలి అనే విషయంపై పరోక్షకంగా హింటిస్తూ జనాలను మేలుకొలుపుతున్నారు..!!