అయ్యయ్యో.. ఈ చిరంజీవి ఏంటి లాస్ట్ మినిట్ లో దెబ్బేశాడు.. మొత్తం పవన్ మీదకే నెట్టేశాడే..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజులు ..కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలపై ఎలాంటి హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయో కూడా మనకు తెలుసు . మరీ ముఖ్యంగా ఈసారి సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో మరింత స్థాయిలో ఏపీ రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినీ ప్రముఖులు.

అంతేకాదు కొంతమంది స్టార్ట్ సినీ డైరెక్టర్ – ప్రొడ్యూసర్స్ – నటులు – హీరోలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా సోషల్ మీడియా వేదికగా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నాగబాబు -వరుణ్ తేజ్ -సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు . మెగాస్టార్ చిరంజీవి కూడా త్వరలోనే ప్రచారం చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి . అంతేకాదు రీసెంట్గా చిరంజీవి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు . నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనుకుంటున్నాను అని పరోక్షకంగానే చెబుతూ ..

“పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అని పిఠాపురం వాస్తవ్యులను రిక్వెస్ట్ చేశారు”.. కాగా తాజాగా చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే . శుక్రవారం మీడియాతో ముచ్చటించారు ఆయన . ఈ క్రమంలోనే “రాజకీయాలకు అతీతంగా ఉండాలని ప్రకటించారు . అంతేకాదు తన తమ్ముడు ఎప్పుడు కూడా తనను ప్రచారంకి రమ్మని పిలవలేదు అని.. తన గురించి తన గురించి పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు అని .. తన తమ్ముడు తనని ఎప్పుడు కంఫర్టబుల్ జోన్ లోనే ఉంచాలి అనుకుంటాడు అని చెప్పుకొచ్చారు”

” అంతేకాదు ఆశపడితే అవార్డులు రావని కూడా చెప్పుకొచ్చారు . దీంతో ఏ సమయానికి ఏది రావాలో అదే వస్తుంది “అని కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పిఠాపురానికి చిరంజీవి వస్తాడు ప్రచారం చేశారు అని అంతా అనుకున్నారు . అయితే అది జరిగే పని లేదు అని తేల్చి చెప్పేసాడు చిరంజీవి. అంతే కాదు ఇప్పుడు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీదకే నట్టేసాడు . పవన్ కళ్యాణ్ కి తన గురించి తెలుసు అని చెప్పడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..!!