సోషల్ మీడియా హీట్ పెంచేస్తున్న జ్యోతిక లేటెస్ట్ కామెంట్స్ ..అంత మాట అనేసింది ఏంటి..?

జ్యోతిక .. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది . టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేయించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక . వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లు జ్యోతిక ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయింది .

ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . బాలీవుడ్లో జ్యోతిక ఓ రేంజ్ లో దున్ని పడేస్తుంది . అజయ్ దేవగణ్ సరసన సైతాన్ అనే సినిమాలో నటించి బాక్సాఫీసును బ్లాస్ట్ చేసేసింది . బాలీవుడ్ మూవీస్ లో నటించకపోవడంపై జ్యోతిక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..” 27 ఏళ్ల క్రితం సౌత్ సినిమాలలో నటించడం ప్రారంభించారు. అప్పుడు సౌత్ లో బిగ్ బిగ్ ఆఫర్స్ వచ్చాయి ..వరుసగా హిట్లు.. అలా బిజీ అయిపోయా.”

” హిందీలో నేను చేసిన మొదటి సినిమా విజయం సాధించలేదు . అంతేకాదు మొదటి సినిమా హిట్ అయితే అవకాశాలు రావాలి .. నేను హిందీలో చేసిన సినిమా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది .కానీ బ్యాడ్ లక్ ఆ సినిమా ఆడలేదు . దీంతో సౌత్ సినిమాల వైపు వెళ్లాను . అయితే బాలీవుడ్ ప్రేక్షకులు నన్ను సౌత్ ఇండియా హీరోయిన్ గానే చూశారు. అందుకే నాకు హిందీ సినిమాల్లో ఇంట్రెస్ట్ లేదు అని అవకాశాలు ఇవ్వడం మానేశారు”.. అని జ్యోతిక ఉన్న విషయాన్నీ క్లియర్గా అర్థమయ్యే రీతిలో చెప్పేసింది..!!