సూసైడ్ చేసుకోవాలనుకున్న నేను సూపర్ స్టార్ గా మారడానికి కారణం ఇదే.. సక్సెస్ సీక్రెట్ రివిల్ చేసిన రజనీకాంత్..?!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా తలైవార్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కండక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తలైవర్‌ సూపర్ స్టార్ గా మారడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాడు. అయితే ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న రజినీకాంత్.. సూపర్ స్టార్ గా ఎదగడానికి వెనుక అసలు రహస్యం ఇదేనంటూ స్వయంగా వివరించాడు. 73 ఏళ్లు వచ్చినా కుర్ర హీరోని మించి అభిమానంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తలైవా.. చివరిగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

తన స్టైల్ తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన రజిని.. తన సినిమాలతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. సీనియర్ హీరో అయినా.. యంగ్ హీరోలకు పోటీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు.. రజనీకాంత్‌తో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇక ప్రస్తుతం ఆశియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా రజనీకాంత్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం రజనీకాంత్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. బస్ కండక్టర్ నుంచి నటుడుగా మారిన రజనీకాంత్ ఒక సమయంలో ఆత్మహ‌త్య‌ చేసుకోవాలనుకున్నారట. నమ్మడానికి వీలుగా లేకున్నా ఇది నిజంగా జరిగిందని స్వయంగా తలైవా వివరించారు. 1992లో సింగపూర్లో తన భార్య లతా రజనీకాంత్ నిర్వహించిన సంగీతగా క‌చేరకి హాజరైస్ సంద‌డి చేసిన ఆయన కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదగడానికి గల కారణాన్ని వివరించారు.

Rajinikanth and wife Latha's love story | Times of India

కుటుంబ పేదరిక కారణంగా తను ఆఫీస్ బాయ్‌గా, కూలీగా, కార్పొరేటర్గా ఇలా ఎన్నో వృత్తుల పని చేస్తానని.. పేదరికంని ప్రత్యక్షంగా అనుభవించిన నాలో ధనవంతుణ్ణి కావాలనే కోరిక ఉండేదని చెప్పుకొచ్చాడు. జీవితంలో నేను దేనికి భయపడలేదని.. కానీ ఒకానొక సమయంలో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించానని.. అయితే కొంతమంది దైవాంశ సంభోదలను ఆరాధిస్తూ వేసిన పెయింటింగ్ తన జీవితాన్ని మార్చేసింది అంటూ వివరించాడు. అది చూసిన తర్వాత తన ఆత్మహత్య నిర్ణయాన్ని మరో రోజు వాయిదా వేసుకున్నానని చెప్పుకొచ్చాడు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రోజే నాకు ఓ కల వచ్చిందని.. తెల్లటి గడ్డంతో చిత్రీకించబడిన పెయింటింగ్లో ఓ సాధువు నది అవతల కనిపించినట్లు.. దగ్గరికి రమ్మని సైగ చేసినట్లు అనిపించిందని.. నేను ఈత కొట్టుకుంటూ అతని దగ్గరకు వెళ్లానని.. మరుసటి రోజు అది రాఘవేంద్రుడని తెలుసుకున్నానంటూ వివరించాడు.

తర్వాత రాఘవేంద్ర మఠానికి వెళ్లి ధనవంతుని కావాలని కోరికను ఆయనకు చెప్పినట్లు.. నిష్టతో గురువారం ఉపవాస దీక్షలు చేస్తూ ప్రార్థించినట్లు వివరించాడు రజినీకాంత్. తర్వాత కండక్టర్ ఉద్యోగం వచ్చిందని.. నటనపై ఉన్న ఆసక్తితో ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ కష్టపడుతున్న సమయంలో సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చింద‌ని ప్రస్తుతం ఈ స్టార్డం అంతా రాఘవేంద్ర స్వామి దయతోనే వచ్చిందని.. నేను భావిస్తాను అంటూ వివరించాడు. అంతేకాదు రజనీకాంత్ 1978లో మంత్రాలయ ద‌ర్శ‌నం గురించి గుర్తు చేసుకున్నాడు. తనకు కలలో కనిపించిన నది మరియు మంత్రాలయ స్థలంలో ఉండే నది అలాంటి ప్రదేశం మరెక్కడా చూడలేదు అంటూ వివరించాడు. 1984లో తన వందో సినిమాకు శ్రీ రాఘవేంద్ర సినిమాను రజనీకాంత్ నటించడం విశేషం.