“అలాంటి పని చేశాను కనుక ఇప్పుడు హీరోయిన్ గా ఉన్నాను”.. మైండ్ బ్లాక్ అయిపోయేలా ఆన్సర్ ఇచ్చిన కాజల్..!

కాజల్ అగర్వాల్ .. టాలీవుడ్ చందమామగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఎంతలా అంటే .. అప్పట్లో కాజల్ అగర్వాల్ కోసం కాల్ షీట్స్ ఖాళీగా పెట్టుకొని వెయిట్ చేసేవాళ్లు. అమ్మడు కాల్ షీట్స్ కోసం ఎగబడి పోయేవారు. అప్పట్లో కాజల్ ఓ రేంజ్ లో ఊపేసింది . ఆల్మోస్ట్ ఆల్ తెలుగు హీరో అందరితో నటించి కాజల్ సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . కాగా ప్రజెంట్ కాజల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ప్రతిదీ కూడా క్లియర్ గా తనదైన స్టైల్ లో ఒక పద్ధతి విధంగా వెళుతుంది.

తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి అటెండ్ అయ్యింది . ఈ క్రమంలోనే కాజల్ ఎన్నో విషయాలను ముచ్చటించింది . మొదటి సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? ఆ విషయంలో ఏం చేసింది ..? అనే విషయాలు కూడా చెప్పుకు వచ్చింది. తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం అనే సినిమాలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది..? అంటూ అలీ ప్రశ్నించగా..

కాజల్ ఆన్సర్ ఇస్తూ..” నా ఫొటోస్ చూసి ఆడిషన్ కి పిలిచారు.. నన్ను ఏం అడుగుతారో ఆడిషన్స్ లో అని చాలా ఎదురు చూశా.. కేవలం ఏడవమని చెప్పారు ..మా నాన్న నా వద్దకు వచ్చి నిజంగానే ఒక ఏడ్చే విషయాన్ని చెప్పారు.. అప్పుడు నాకు ఏడుపొచ్చేసింది. ఏడ్చేసాను ..లక్ష్మీ కళ్యాణం సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇప్పటికీ మా ఇంట్లో సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు ..నువ్వు ఏడ్చిన కారణంగానే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారావు “అని అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకు వచ్చింది కాజల్ అగర్వాల్..!