ప్రస్తుతం కోట్లల్లో సంపాదిస్తున్న అనసూయ.. కెరీర్ స్టార్టింగ్ లో కేవలం రూ. 500 కోసం అలాంటి పని చేసిందా..?!

టాలీవుడ్ బోల్డ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ‌ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పోట్టి బట్టలో స్కిన్ షో చేయడంలో సంచలనాల సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు ట్రోల్స్ ఎదురైనా వాటిని పట్టించుకోకుండా కెరీర్ కోసం ముందుకు సాగుతుంది. అయితే మొదట నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అనసూయ.. అప్పట్లో సినిమా అవకాశాల కోసం ఎంతో కష్టపడింది.

2003లో ఎన్టీఆర్ హీరోగా, సదా హీరోయిన్గా తెరకెక్కిన ఓ పొలిటికల్ థ్రిల్లర్ లో కాలేజ్ స్టూడెంట్‌గా చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో ఆమెకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఓ సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే ఆయన వెనుక నుంచునే స్టూడెంట్ పాత్రలో ఆమె క‌నిపించింది. కేవలం 19 ఏళ్ల వయసులో.. ఆమె జూనియర్ కాలేజీలో ఉన్న టైంలో నాగ సినిమాతో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన అనసూయ ఈ మూవీలో ఆమె పార్త ఓసం కేవలం రూ.500 మాత్రమే తీసుకుందట.

Pushpa-2: Sukumar to show Anasuya in a hot avatar? - Andhrawatch.com

అది ఒక జూనియర్ ఆర్టిస్ట్‌కి ఆ రోజుల్లో ఇచ్చే పేమెంట్. ఇప్పుడు అనసూయ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు లక్షల్లో సంపాదిస్తున్న ఈ అమ్మడు కోట్లు కూడబెడుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టిన అనసూయ స్వశక్తితో ఎదిగి లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తుంది. ప్రొఫెషనల్ గా ఎంత బిజీ అయినా.. ఫ్యామిలీతో కచ్చితంగా తన సమయాన్ని కేటాయిస్తుంది. ఇక పాన్ ఇండియ‌న్ మూవీ పుష్పా 2లో దాక్షాయినిగా నెగెటీవ్‌ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.