ఓరి దేవుడోయ్ .. నాగచైతన్య తండేల్ కోసం టోటల్ రెండా..? ఏం మాస్ ప్లానింగ్ రా బాబు..!

నాగచైతన్య .. కెరియర్ ఎంత అయోమయంగా ఉందో మనకు తెలిసిందే. కొన్ని హిట్లు కొన్ని ప్లాపులతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు. అయితే ఏ ముహూర్తాన సమంతతో విడాకులు తీసుకున్నాడో అప్పటినుంచి నాగచైతన్య హిట్ అనే పదానికి దూరమయ్యాడు . దూత వెబ్ సిరీస్ కారణంగా ముక్కి మూలిగి ఒక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . కానీ ఇక తర్వాత నాగచైతన్య క్రేజ్ డమాల్ అంటూ పడిపోయింది . ఇప్పుడు నాగచైతన్య ఆశలు అన్నీ కూడా తండేల్ అనే సినిమాపైనే ఉన్నాయి.

చందు మొండేటి దర్శకత్వంలో హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న సినిమాలో హీరోగా నాగచైతన్య నటిస్తున్నారు . ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయినా లీక్ అయిన సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు. కాగా ఈ సినిమా మొత్తం రియల్ ఇన్సిడేంట్స్ ఆధారంగా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో నాగచైతన్య ఇంతకుముందు ఎప్పుడు కనిపించినటువంటి ఒక మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు .

జనరల్ గా సినిమాకి ఒక క్లైమాక్స్ ఉంటుంది . కానీ ఈ సినిమాకి మాత్రం చందు మొండేటి..రెండు క్లైమాక్స్లను రాసుకున్నారట . అంతేకాదు రెండు క్లైమాక్స్ లు కూడా ఒకే సినిమాలో చూపించడానికి చందు మండేటీ ట్రై చేస్తున్నారట . క్లైమాక్స్ ఎలా ఉంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనే విధంగా ఒకటి .. క్లైమాక్స్ ఇలా ఉంటేనే సినిమా బాగా ముందుకెళ్తుంది అనే కోణంలో మరొకటి చందు క్లియర్గా రాసుకున్నారట . బుజ్జి తల్లి క్యారెక్టర్ లో సాయి పల్లవి చించేస్తుంది అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!