అలాంటి ప్రశ్న అడిగిన ఉపాసన..? తడబడ్డ చిరంజీవి.. వీడియో వైరల్..!

ఉపాసన ..మెగా కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . మెగా కోడలు కాకముందు కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రాంచరణ్ భార్య అయిన తర్వాత మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటూ వస్తుందో మనకు తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఒక సెన్సేషనల్ వీడియోని షేర్ చేసుకుంది. ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రధానం చేశారు .

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు . అవార్డు తీసుకోవడానికి ముందు చిరంజీవితో ఆయన కోడలు ఉపాసనా సరదాగా ముచ్చటించింది. దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ గా మారింది . ఈ వీడియోలో ఉపాసన – చిరంజీవిని ప్రశ్నిస్తూ…

“మావయ్య క్లిం కార కు నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి..?” అంటూ ప్రశ్నిస్తుంది . దీనికి చిరంజీవి..” క్లింకార నీకు ప్రతిరూపం అని సమాధానం ఇస్తాడు. అయితే ఉపాసన కాదు కాదు మా ఇద్దరి తాతగార్లకి పద్మ విభూషణ్ వచ్చి వచ్చింది” అంటూ చెప్పుకొస్తుంది . దానికి చిరంజీవి నవ్వుతూ స్పందిస్తూ ..వీసీ రెడ్డి గారికి ..నాకు ” అంటూ నవ్వుతూ ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఉపాసన తాత ప్రతాప్ సీ రెడ్డికి 2010లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే..!