ఎన్టీఆర్ సినిమా కాపీ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఒక్క పోస్టర్ తో అడ్డంగా దొరికిపోయాడుగా..!

విజయ్ దేవరకొండ.. తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. తన 35వ పుట్టినరోజును చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు రౌడీ హీరో . ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ ఇచ్చారు . ఫ్యామిలీ స్టార్ సినిమాతో అభిమానులను హర్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. విజయ్ తిన్నురి దర్శకత్వంలో ఒక సినిమాకి ఎప్పుడో కమిట్ అయిన విషయం తెలిసిందే.

అంతేకాదు ఇప్పుడు తాజాగా కొత్తగా రెండు సినిమాలను కమిట్ అయ్యాడు. సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్స్ దిల్ రాజు – శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజావారు రాణి గారు సినిమా డైరెక్టర్ రవి కిరణ్ కొలా తో ఒక సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా.. నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది .

కాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ..”ఈ సినిమాలో ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘ కత్తి నేనే ..నెత్తురు నాదే ..యుద్ధం నాతోనే ‘అనే క్యాప్షన్ ఇచ్చారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి కాస్ట్ అండ్ క్రూ వివరాలు కూడా త్వరలోనే తెలియజేయునన్నారు. అయితే ఈ పోస్టర్ చూస్తూ ఉంటే ఇంచుమించు ఒక రకంగా ఎన్టీఆర్ దేవర సినిమాకు దగ్గర పోలికల్లో ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొంతమంది దేవర సినిమాకు ఇది కాపీ అంటూ కూడా మాట్లాడుతున్నారు. దీంతో విజయ్ దేవరకొండ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!