” పుష్ప 2 ” సెకండ్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే..?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చివరిగా నటించిన మూవీ పుష్పా. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకుని రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా రూపొదిస్తున్నారు. ఇక మ్యూజిక్ సెన్సేష‌న్‌ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా, బ్యాక్గ్రౌండ్ స్కోరర్ గా పనిచేస్తున్నాడు.

First Song 'Pushpa Pushpa' From Allu Arjun's 'Pushpa 2 - The Rule' Released - Sacnilk

ఇక ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇటీవల మేకర్స్ పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయగా.. ఈ సాంగ్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మ‌ళ‌యాళం అన్ని భాషల్లోనూ రిలీజై ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు సృష్టించింది. ఇప్పటికీ సాంగ్ మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మొదటి సాంగ్ తోనే ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప గాడు రెండో పాట ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.

Pushpa makers remove Allu Arjun and Rashmika Mandanna's controversial scene - India Today

ఈ క్రమంలో ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఓ రొమాంటిక్ సాంగ్ రాబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్, రష్మిక మందన పై వచ్చే రొమాంటిక్ సాంగ్ గ్రాండ్గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మైత్రి మేకర్స్. ఇక ఈ నెలాఖరులోనే పుష్ప సెకండ్ సింగల్ కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.