చిరంజీవి ‘ విశ్వంభర ‘ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేయాలంటే..?!

తెలుగు టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర‌ షూట్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి తను నటించిన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. తెలుగులో మొట్టమొదటి రూ.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు కొల‌గొట్టిన సినిమా ఇదే కావడం విశేషం. అలాగే రూ.50 కోట్ల వ‌సూళ్ళు కొల్లగొట్టిన తెలుగు సినిమా కూడా చిరంజీవిదే. ఇలా ఇప్పటికే ఆయన కెరీర్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన మెగాస్టార్.. 70 ఏళ్ల వయసులోనూ అంతే యంగ్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

Trisha shares a moment from the 'Vishwambhara' musical session with  Chiranjeevi and MM Keeravani, saying "divine and legendary." | - Times of  India

యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ పాపులారిటీ మరింతగా పెంచుకుంటున్నాడు. ప్రేక్షకులకు నచ్చిన దాని ఎంత కష్టమైనా ప్రేక్షకులను మెప్పించేందుకు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చిరు.. ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర పాన్‌ ఇండియా లెవెల్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతుంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు రూ.2కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. స్టార్ హీరో చిరంజీవి లాంటి వారు సినిమాలో ఉన్నారంటే ఆ సినిమాకు కచ్చితంగా నార్త్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి మార్కెట్ ఉంటుంది.

కానీ గతంలో చిరంజీవి నటించిన సైరా సినిమా నార్త్‌లో అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ పై కాస్త టెన్షన్ మొదలైంది. అయినా విశ్వంభ‌రాతో ఈసారి భారీ బ్లాక్ బ‌స్టర్ కొట్టడానికి చిరు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే కచ్చితంగా చిరంజీవి ఈ ఏజ్ లో మరో రికార్డును క్రియేట్ చేసినట్లే. ఇక ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో ఎవరు కూడా తమ సినిమాతో రూ.100 కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టలేదు. క‌నుక‌ చిరు సినిమాకు రూ.200 కోట్ల కలెక్షన్ రాబడితే చిరంజీవి సినీ కెరీర్ లో మరో కొత్త రికార్డు క్రియేట్ అవుతుంది.