తెలుగు ఇండస్ట్రీ పై సంయుక్త మీనన్ ఒపీనియన్ ఇదా..? నిర్మొహమాటంగా చెప్పేసిందిగా..!

సంయుక్త మీనన్.. పేరుకిమలయాళీ బ్యూటీ . చాలా చక్కగా ఉంటుంది. అందంగా మాట్లాడుతుంది . ఆకర్షణీయంగా నటిస్తుంది . అందరితో సరదాగా అల్లుకుపోతుంది. మరీ ముఖ్యంగా తన పని తాను చూసుకొని పోతుంది . ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండడం చాలా తక్కువ . అందుకే మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాలేకపోయిన సంయుక్తా మీనన్ తెలుగు ఇండస్ట్రీలో కేవలం కొద్ది సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

ప్రజెంట్ ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి . ఇదే మూమెంట్లో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీపై సంయుక్త మీనన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. “మలయాళం తో పోలిస్తే తెలుగు సినిమాలలో నటించడం చాలా చాలా కష్టం ఎందుకో తెలియదు ..నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది ..భాష రాకపోవడం ఒక రీజన్ అనుకుంటున్నాను ..మరొక కారణం మేకప్ ..ఎందుకంటే నాకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు . నా వరకు అది చాలా చాలా టఫ్.. మలయాళం సినిమాలో చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం చాలా సింపుల్ గా అయిపోతుంది ..”

“నేచురల్ లుక్స్ లో ఉంటాయి.. కానీ తెలుగు సినిమాల్లో నటించాలి అంటే మాత్రం గంటలు గంటలు మేకప్ వేసుకోవాలి .. నాకు నచ్చని పని అది . అందుకే ఇది నాకు అసౌకర్యంగా అనిపిస్తుంది . చర్మం ముఖంపై ఏదో ఉన్నట్లు వింతగా అనిపిస్తూ ఉంటుంది “అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది సంయుక్త. ప్రస్తుతం తెలుగులో ఆమె నిఖిల్ సరసన స్వయంభు లో నటిస్తుంది. భరత కృష్ణమాచార్య దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.