విజయ్ దేవరకొండ కి రష్మిక బర్త్ డే విషెస్ చెప్పకపోవడం వెనక ఇంత అర్థం ఉందా..? ఫాన్స్ మరి టూ మచ్ చేసేస్తున్నారే..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నా ల మధ్య ప్రేమాయణం గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎందుకో కూడా మనకు తెలుసు . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది .

కొన్నిసార్లు ఎవరైనా తెలియని వాళ్ళు వీళ్ళని చూస్తే నిజంగా భార్యాభర్తలేమో అని అనుకోకు తప్పదు . అంత పర్ఫెక్ట్ గా వీళ్ల మధ్య కెమిస్ట్రీ ఉంటుంది . బయట కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటూ ఉండడంతో వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని ..పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలు కొట్టి పడేస్తూనే వచ్చారు రష్మిక – విజయ్ .

తాజాగా విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును జరుపుకున్నాడు . 35వ పుట్టినరోజును బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు . అయితే ఎప్పుడు కూడా విజయ్ బర్త్ డే అప్పుడు సోషల్ మీడియాలో డిఫరెంట్ గా విష్ చేసే రష్మిక ఈసారి విష్ చేయలేదు . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయ్. “నేను చేస్తే కచ్చితంగా మళ్ళీ ఏదో ఒక గోల స్టార్ట్ అవుతుంది అందుకే సోషల్ మీడియా వేదికగా కాకుండా పర్సనల్గా విజయ్ దేవరకొండకు విష్ చేసింది రష్మిక “అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది..!