ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన శోభిత.. సమంత స్టైలిష్ట్ రిప్లై.. మ్యాటర్ ఏంటంటే..?!

తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాళ‌.. టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు ఏకంగా హాలీవుడ్‌లోను ఆఫర్స్ అందుకుంటూ తన సత్తా చాటుతుంది. ఇటీవల వెకేషన్స్‌కు వెళ్ళిన ఈ అమ్మడు.. నాగచైతన్యతో కలిసి పలు ఫోటోలో కనిపించడంతో ఈమెకు చైతన్యతో ఎఫైర్ ఉందంటూ రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై శోభితా, చైతన్య ఇద్దరు స్పందిస్తూ అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వార్తలకు చెక్ ప‌డకపోవడంతో వాటిని పట్టించుకోవడం మానేసి ఎవరిప‌నిలో వారు బిజీ అయ్యారు.

Samantha's stylist Preetham Jukalkar receives death threats from Akkineni Naga Chaitanya's supporters? | Telugu Movie News - Times of India

కాగా.. తాజాగా శోభిత షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ” ఐయామ్ నాట్ ఎవరీ వన్ కప్ ఆఫ్ చాయ్(chai) “.. అండ్ థాట్స్ ఓకే అని వివరించింది. నేను అందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని దాని అర్థం. అయితే సాధారణంగా టీ గురించి మాట్లాడేవారు అంతా కప్ ఆఫ్ టీ అని రాస్తారు. కానీ శోభిత కప్ ఆఫ్ ఛాయ్ అని రాయ‌డంతో కొందరు నెటిజ‌న్లు చైతన్యన్ని ప్రస్తావిస్తూ ఇలా రాసి ఉంటుందని టీ బదులు చై అని రాయడం వెనక ఏదో కారణం ఉంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక‌ శోభిత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ ఈ పోస్ట్ కు స్పందించాడు. నేను కూడా నా విషయంలో అలాగే ఫీల్ అవుతాను అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ న్యూస్ మ‌రింత వైరల్‌గా మారింది. అసలు శోభిత దేని ఉద్దేశించి ఆ కామెంట్ చేసిందో.. దానికి ప్రితం జుక్కల్కర్ ఇచ్చిన రిప్లై కి అర్థమేమిటో అసలు అర్థం కావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.