మరోసారి ఆ హీరోయిన్ తో సమంత.. ఈసారి రచ్చ మామూలుగా ఉండదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు భలే చక్కగా ఉంటాయి . ముద్దుగా కూడా ఉంటాయి . ఆఫ్ కోర్స్ హీరో – హీరోయిన్ లు మాత్రమే కలిసి నటించాలి అని లేదు ..ఇద్దరు హీరోయిన్స్ కలిసి నటించిన సినిమాలు కూడా జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలాంటి క్రేజీ క్రేజీ కాంబోలో ఎక్కువగా రావు ..వస్తే మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోతూ ఉంటారు .

అలాంటి క్రేజీ కాంబో నే అనుపమ పరమేశ్వరణ్ – సమంత . వీళ్లిద్దరూ కలిసి అ ఆ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత – అనుపమల పర్ఫామెన్స్ ఈ సినిమాలకి హైలైట్ గా నిలిచింది . అయితే మరోసారి ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారింది .

ఓ యంగ్ డైరెక్టర్ వీళ్ళిద్దరిని పెట్టి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీని చిత్రీకరించబోతున్నారట . దీనికి అనుపమ పరమేశ్వరన్ అదేవిధంగా సమంత ఇద్దరు కూడా ఓకే చేశారట . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందట . సోషల్ మీడియాలో ప్రెసెంట్ దీనికి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!