విశ్వంభర లో త్రిష రోల్ అదేనా..? కొత్త పోస్టర్ తో లీక్ అయిన అసలు మ్యాటర్..!

విశ్వంభర టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి . ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి త్రిష లుక్ ను రిలీజ్ చేశారు. త్రిష చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపించింది. ఫస్ట్ చాలా చాలా హాట్ రోల్స్ చూస్ చేసుకున్న త్రిష ..

సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ట్రెడిషనల్ లుక్స్ లో కనిపిస్తుంది. కాగా ఈ సినిమాలో త్రిష పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . హీరోయిన్ త్రిష ఈ సినిమాలో డ్యూయల్ లుక్ లో కనిపించడమే కాకుండా సినిమా కోసం భారీ భారీ రిస్కులు కూడా చేస్తుందట. యుద్ధ సన్నివేశాల కోసం కత్తి సాము కూడా నేర్చుకునిందట. అంతేకాదు ఈ సినిమా ఫ్లాష్ బాక్ లో వచ్చే స్టోరీలో త్రిష చాలా చాలా పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించబోతుందట .

కేవలం ఆమె లుక్స్ కోసమే కోట్లు ఖర్చు చేశారట మేకర్స్ . ఈ సినిమాలో ఆమె పాత్ర ఇప్పటివరకు తన కెరీర్ లో ఎప్పుడు చేయనటువంటి విధంగా ఉంటుంది అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో విశ్వంభర సినిమాకు సంబంధించిన హాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో బిగ్ హిట్స్ తన ఖాతాలో వేసుకునేలానే ఉంది..!!