ఛీ ఛీ.. పవన్ కళ్యాణ్ ఇంత పిరికివాడా..? ఆ దమ్ము లేదా ఏంటి..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అయ్యేది .. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ టాలీవుడ్ ఇండస్ట్రీ పవర్ అంతా ఆయనలోనే ఉంది . ఆయనను ఆయన అభిమానులు ఓ హీరోలా కాకుండా .. ఓ దేవుడిలా చూస్తూ ఉంటారు ..అభిమానిస్తూ ఉంటారు . ఆరాధిస్తూ ఉంటారు . అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన గతం తాలూకా వార్తలను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు జనాలు .

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన కెరియర్ ని మలుపు తిప్పే సినిమాను మిస్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ సినిమా మరేంటో కాదు గజిని . ఎస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ను మలుపు తిప్పిన సినిమా. గజినీ సినిమా ఇప్పటికీ మనం టీవీలో వస్తే ఇంట్రెస్టింగ్గా కళ్ళు ఆర్పకుండా చూస్తాం . ఈ సినిమాలో సంజయ్ రామ స్వామిగా సూర్య జీవించేసాడు . ఆ సిన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

సూర్య – అసిన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను మొదటిగా తెలుగులో పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలనుకున్నారట డైరెక్టర్ . అయితే పవన్ కళ్యాణ్ కథ విని ఈ సినిమా కోసం గుండు కొట్టించుకోవాలి అని చెప్పడంతో గుండులో ఆయన ఫేస్ లుక్స్ బాగోవు అంటూ కథ నచ్చిన సరే గుండు కొట్టించుకోవాలి అన్న భయంతో మంచి సినిమా ఆఫర్ ను మిస్ చేసుకున్నారట. గతంలో తన సినిమాల కోసం చాలా చాలా రిస్కులు చేశాడు పవన్ కళ్యాణ్ . అలాంటి పవన్ కళ్యాణ్ చిన్న గుండు కొట్టించుకో అన్న కారణంగా ఇంత మంచి సినిమాని మిస్ చేసుకోవడంతో అప్పట్లో చాలా హాట్ హాట్ గా ఈ వార్త ట్రెండ్ అయింది . అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇంత పిరికివాడా..? అంటూ కూడా అప్పట్లో ట్రోల్ చేశారు..!!