“ఆ హీరో అంటే చిరాకు”..త్రిష అంత మాట అనేసింది ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు . మరి ముఖ్యంగా హీరో హీరోయిన్లు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడం చాలా చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఆఫ్కోర్స్ వాళ్ళ మధ్య సఖ్యత బాగున్న కెమిస్ట్రీ బాగా వర్క్ అయిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడంతో .. ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అయితే మీడియాలో వచ్చే పలు వార్తలు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఇబ్బందులకు గురిచేస్తుంది అన్న భయంతో కొంతమంది హీరోయిన్స్ ఆ హీరోలను దూరం పెట్టేస్తూ ఉంటారు . కానీ మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తమకు నచ్చిన హీరోలతో నచ్చిన విధంగా ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది త్రిష .

అందాల ముద్దుగుమ్మ ..సెకండ్ ఇన్నింగ్స్ లో ను ఓ రేంజ్ లో దున్నేస్తుంది . కాగా హీరోయిన్ త్రిష కు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ గురించి ఈనాటి ది కాదు. దాగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇప్పటికి వాళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని షేర్ చేసుకున్నింది త్రిష .

“షూటింగ్స్ పార్ట్ లో అందరూ సరదాగా గడిపే సమయంలో విజయ్ మాత్రం పక్కకు వెళ్లి ఓ మూలన కూర్చొని ఉంటారు అని.. ఏదో పోగొట్టుకున్న వాడిలా గంటలు గంటలు గోడ వైపు చూస్తూ ఉంటాడు అని.. అందరూ ఎంజాయ్ చేస్తుంటే విజయ్ మాత్రం అలా సైలెంట్ గా ఉంటాడు అని .. ఎన్నిసార్లు పిలిచినా రాడు అని ..అదే షాట్ రెడీ అంటే మాత్రం పరుగు పరుగున వచ్చేస్తాడు అని ..విజయ్ ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టమని చెప్పుకొచ్చింది”.. అంతేకాదు విజయ్ లఒ ఇష్టం లేని క్వాలిటీ ఏంటి అంటే మాత్రం అదే అని చెప్పుకొస్తుంది. అంతే కాదు కొన్నిసార్లు ఆ బిహేవియర్ చిరాకు కూడా తెప్పిస్తుందట..!!