ఆ స్టార్ నటుడుతో డేటింగ్ లో బన్నీ హీరోయిన్… బయటపడకుండా బాగానే మేనేజ్ చేశావుగా…!!

అను ఇమ్మానుయేల్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో.. నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందం మాత్రమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక ఈ పరంగా చూస్తే ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. నాని సరసన మజ్ను సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. అనంతరం స్టార్ హీరోల సరసన నటించింది.

అల్లు అర్జున్ తో..” నా పేరు సూరి నా ఇల్లు ఇండియా ” సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్ద గా సినిమా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు పాతాళానికి పడిపోయింది. ఈమె నటించిన సినిమాలేవి హిట్ కాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోలు చేసినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఈ ముద్దుగుమ్మ సినిమాలలో చాన్స్ వస్తే చాలు స్టోరీ వినకుండానే ఓకే చెప్పేస్తుందట. అందుకేనేమో ఈమె నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇలాంటి తరుణంలోనే కోలీవుడ్ హీరోను ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పారట. వచ్చే వేసవిలో వీరిద్దరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇక ఆ హీరో ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.