అనన్య పాండే తో డేటింగ్ వార్తలపై స్పందించిన యంగ్ హీరో.. మరీ అలా చెప్పేశావు ఏంటి భయ్యా..!!

బాలీవుడ్ లో ప్రెసెంట్ వైరల్ అవుతున్న కొత్త జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. ఇద్దరూ గత కొద్ది కాలంగా ప్రేమలో ఉంటున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే స్టోరీలు, ఈవెంట్స్ అంటూ ఇద్దరూ కలిసి హాజరవుతూ పలుమార్లు కెమెరాలకు చిక్కుతున్నారు. కానీ ఈ రూమర్స్ పై మాత్రం ఇద్దరూ ఏ మాత్రం స్పందించడం లేదు.

అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న టాక్ షో ” కాఫీ విత్ కరణ్ 8 ” కు గెస్ట్ గా ఆదిత్య రాయి కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను డిస్నీ +హాట్స్టార్ లో విడుదల చేశారు.

పెళ్లి కానీ బాయ్స్ వచ్చేసారని కరణ్ అంటూ…ఆ తర్వాత ” అనన్య పాండే తో నువ్వు డేటింగ్ చేస్తున్నావని రూమర్స్ వస్తున్నాయి? ” అంటూ ఆదిత్యాను అడిగేసారు. దీంతో ” మీరు నన్ను రహస్యాలు అడగొద్దు. నేను మీకు అబద్ధాలు చెప్పను “అంటూ తప్పించుకున్నాడు ఆదిత్య. ఇక దీని బట్టి చూస్తే వీరిద్దరూ కూడా ఈ వార్తలపై ప్రస్తుతం స్పందించరేమో అనిపిస్తుంది.