సంపాదనలో షారుక్, బన్నీల‌నే దాటేసిన ఈ ముద్దుగుమ్మ.. నెల‌కి ఎంత సంపాదిస్తుందంటే..?!

బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ జన్నత్ జుబేర్ రహ్మణి నటిగా, సింగర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా క్రేజ్ దక్కించుకున్న ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా చూపరచితమే. అయితే అందరికీ తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె తెలియని వారు ఉండరు. కేవలం ఏడేళ్ల వయసులోనే బుల్లితెరపై కనిపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. 2009లో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ 2011లో కలర్స్ టీవీలో ఫుల్వాతో బుల్లితెరపై మెరిసింది. అప్పటి నుంచి పలు సీరియల్ లో, లైవ్ ప్రోగ్రామ్స్ లో, రియాల్టీ షోస్ లో, సాంగ్ ఆల్బమ్స్ లో తన సత్తాను చాటుకుంటూ సోషల్ మీడియాను కుదిపేసింది.

Jannat Zubair Rahmani | ఔట్‌ఫిట్ డ్రెస్‌లో జన్నత్ జుబేర్ రహ్మానీ  సొగ‌సులు..-Namasthe Telangana

2018లో బాలీవుడ్ లో అడుగుపెట్టి హిచ్కి మూవీ ఛాన్స్ కొట్టేసింది. రాణి ముఖర్జీ స్టూడెంట్స్‌లో ఒకరిగా నటించి మంచి మార్కులు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ యాక్టర్ గా కొనసాగుతూనే.. సింగర్ గా, వాయిస్ ఆర్టిసిగా, టిక్ టాక్‌లో ఇలా ఇండస్ట్రీలో దాదాపు అన్ని ప్రొఫెషన్స్ లో తన సత్తా చాటుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ లను కూడా వెనక్కు నెట్టేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 22 ఏళ్లు కాగా ఈ బ్యూటీ కేవలం తన ఇన్స్టా పోస్టులతోనే రూ.25 కోట్లు పైగా సంపాదిస్తుంది.

EXCLUSIVE: Allu Arjun gives Shah Rukh Khan's Jawan a miss for Pushpa 2 |  PINKVILLA

ముంబైలో విలాసవంతమైన హౌస్, మూడు కోట్ల విలువ చేసే లగ్జరీ కార్, చుట్టూ ఎప్పుడూ అసిస్టెంట్స్, ల‌గ్జ‌రీ లైఫ్‌.బాలీవుడ్ లోనే ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నుంచి పంజాబీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ తన గొంతుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు వెండి తెరపై ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ సత్తా చాటుతుంది. వీటితో పాటు తూ ఆషికి, కత్రోన్ కే కిలాడి, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో ల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని పాన్ ఇండియా హీరోలను కూడా వెనక్కు నెట్టింది.

Amitabh Bachchan shares a happy pic with Rashmika Mandanna | India Forums

ఇన్‌స్టాగ్రామ్ పాపులర్ ఫిగర్ గా మారిన ఈమెకు ప్రస్తుతం ఇన్స్టా లో 48 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమెకు ఏడాదికి రూ.25 కోట్ల వరకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో షారుక్ కి 42 మిలియన్లు, అమితాబ్ కు 38 మిలియన్లు, నేషనల్ క్రష్‌ రష్మికకు 41 మిలియన్లు, అల్లు అర్జున్ 24 మిలియన్లు, జాన్వి కపూర్ కి 22 మిలియన్లు మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ బ్యూటీ క్రేజ్ ఇన్స్టాల్ లో ఏ రేంజ్ లో ఉందో అర్థమై ఉంటుంది. ఇక సోషల్ మీడియా ద్వారా ఇంత క్రేజ్ తెచ్చుకున్న జన్నత్ మీడియా, ఎంటర్టైన్మెంట్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కేటగిరీలో ఫోర్బ్ 30 లిస్టులో ప్లేస్ దక్కించుకుంది.