రీ రిలీజ్ తో మరోసారి వార్ కి రెడీ అంటూన‌ రజినీకాంత్, కమలహాసన్..!

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమలహాసన్ నీ రెండు కల్లుగా చూస్తుంటారు. వీరిద్దరూ తనదైన రీతిలో వరుస సక్సెస్ లు తమ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీళ్లిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు రజినీకాంత్ సినిమాలు విజయం సాధిస్తే మరికొన్నిసార్లు కమల్ హాసన్ సినిమాలు విజయాలు సాధించాయి. ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ నిజానికి వీరిద్దరూ కూడా బయట మంచి స్నేహితుడు.

ఎప్పుడైనా సరే వీరిద్దరూ కలుసుకుని చాలాసార్లు మాట్లాడుకుంటూ సినిమాల గురించి పర్సనల్ విషయాల గురించి కూడా డిస్కస్ చేసుకునే చనువు వీరిద్దరి మధ్య ఉంది. ఇక ఒకానొక సందర్భంలో కమలహాసన్, రజనీకాంత్ కంటే సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయినప్పటికీ రజినీకాంత్ మాత్రం వ‌రుస‌ సినిమాలను ఎక్కువగా చేస్తూ కమలహాసన్ కంటే కూడా పెద్ద రేంజ్ కి వెళ్లి తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ గా పేరు పొందాడు. అందుకే చాలామంది కమల్ హాసన్ కంటే రజినీకాంత్ చాలా పెద్ద హీరో అంటూ పొగుడుతారు కూడా.

అందుకే తెలుగులో సైతం కమలహాసన్ కంటే రజినీకాంత్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిద్దరూ తమ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు కూడా వీళ్ళ మధ్య పోటీ అనేది కొనసాగనుంది. ఇక మూవీ రిలీజ్ అప్పుడే కాకుండా రీ రిలీజ్ టైం లో కూడా వీరిద్దరి మధ్య పోటీ ఉండడం అనేది నిజంగా అభిమానులకి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక రజినీకాంత్ ” ముత్తు ” అనే సినిమాని రీ రిలీజ్ చేస్తుండగా.. కమలహాసన్ ” అభయ ” సినిమా ని రీ రిలీజ్ చేయనున్నాడు. మరి ఈ రిలీస్ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.