ఎమ్మెల్యేలకు ఎర్త్‌ పెడుతున్న ఎమ్మెల్సీలు….!

బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రేసులోకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలకు షాక్‌ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులనే తమవైపు తిప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఉవ్విళ్లూరుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో సిట్టింగ్‌లకు చెక్‌ పెట్టి సీటు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్‌ […]

సీట్లు ఫైనల్..ఈ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నో.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి సత్తా చాటాలని చూస్తున్న కే‌సి‌ఆర్.. తమ పార్టీ నుంచి బలమైన అభ్యర్ధులని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మొదట లిస్ట్ విడుదల చేయడంపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇక దాదాపు అభ్యర్ధులని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. సుమారు ఓ 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం మాత్రం లేదని సమాచారం. వారికి ఆల్రెడీ కే‌సి‌ఆర్..పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. కే‌టి‌ఆర్, హరీష్ ద్వారా..వారిని బుజ్జగించే ప్రయత్నాలు […]

గులాబీ ‘అభ్యర్ధులు’ రెడీ..ఆ సిట్టింగులకే నో ఛాన్స్.!

మరో మూడు రోజుల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ రానుంది. ఈ నెల 21న సి‌ఎం కే‌సి‌ఆర్..తమ పార్టీ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేయనున్నారు. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలిసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 10 లోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 కాంగ్రెస్, 7 ఎం‌ఐ‌ఎం, 3 […]

కమ్యూనిస్టులతో కలిసే..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే అభ్యర్ధుల ఎంపికపై కే‌సి‌ఆర్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఎండింగ్‌కు వచ్చిందని తెలిసింది. దాదాపు సిట్టింగులకే సీట్లు ఫిక్స్ అవుతున్నాయని తెలిసింది. ఇక బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలక్ సీటు ఇవ్వకూడదని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారు. ఇక వారు జంప్ అవ్వకుండా..అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. అటు కాంగ్రెస్ […]

ఎన్నికల సమరం..త్రిముఖ పోరు..!

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినే. ఈ క్రమంలో ఈ సారి అధికారం దక్కించుకోవడం కోసం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిలు హోరాహోయిగా తలపడనున్నాయి. అయితే ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే నడుస్తుంది. ఒక 20-30 స్థానాల్లో బి‌జే‌పి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీలు ప్రజా క్షేత్రంలోకి దిగాయి. ఓ వైపు అధికార బి‌ఆర్‌ఎస్ మూడోసారి అధికారం దక్కించుకోవడం […]

కాంగ్రెస్‌లోకి బిగ్ లీడర్స్..మైలేజ్ పెరుగుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టింది. బలంగా ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని గట్టిగా ఢీకొట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో పార్టీ బలం మరింత పెంచేలా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నారు. పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. […]

కేసీఆర్ సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్న పథకాలు…!

ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు పవర్స్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ లీడర్స్‌గా సీన్ మారుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్ అందుకోసం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రెండు పర్యాయాల పాలనపై అసంతృప్తిగా ఉన్న ప్రజలను ఆకర్షించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒక్కో వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి ఎన్నికల పథకాలను […]

ఆ ఇద్దరు వారసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.!

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మొత్తం 119 సీట్లు ఉంటే అందులో 103 మంది బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. దీంతో 103 మందికి సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్‌కు రిస్క్. అందుకే ప్రజా వ్యతిరేకత ఎదురుకునే కొందరు ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఇదే […]

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?… 30 మంది సిటింగ్‌లకు చెడ్డ పేరు… కేసీఆర్‌ చేయించుకున్న సర్వేల్లో 30 మంది సిటింగ్గులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా సర్వేలను బట్టి చూస్తే… ఈ 103 మందిలో ఇప్పుడు అనేక మందికి టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం. ఆయనొక మంత్రి.. ఎప్పుడూ కేసీఆర్‌ వెంట పలు కార్యక్రమాల్లో […]