సైకిళ్లకు పంచర్లు వేసుకునే ముఖం నీది”.. నాగబాబు పై అల్లు అర్జున్ సెన్సేషనల్ ట్వీట్ వైరల్..!

“ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ గా పోపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అదే విధంగా మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దానికి కారణం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తరఫున మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రచారం చేశారు . అయితే అల్లు అర్జున్ మాత్రం ఒక ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడి ఆ తర్వాత పక్క రోజే నంద్యాలకు వెళ్లి తన ఫ్రెండ్ శిల్పకు సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.

దీంతో మెగా ఫాన్స్ కూడా కొంతమంది హర్ట్ అయ్యారు . దీనిపై నాగబాబు పరోక్షకంగా స్పందిస్తూ ట్విట్ చేశారు . “మావాడు కాదు పగవాడైనా మా వాడే ” అనే రేంజ్ లో అర్థం కాని అర్థం అయినట్లు అల్లు అర్జున్ ని టార్గెట్ గా చేస్తూ ఒక ట్వీట్ చేశాడు . అయితే ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోలేదు. తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ – నాగబాబు పై సెన్సేషనల్ ట్విట్ చేసినట్లు ఓ స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. ” అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ముందున్న సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకునేటోడు అనే విధంగా ఉన్న పోస్ట్ ” ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది.

అయితే ఈ పోస్ట్ బన్నీ పెట్టలేదు అని కొందరు అంటున్నారు . కానీ బన్నీ అకౌంట్ నుంచే ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే బన్నీ అకౌంట్ హ్యాక్ చేశారని అలా ఎవరో కావాలని అల్లు – మెగా ఫాన్స్ మధ్య గొడవ పెట్టడానికి ఇలా క్రియేట్ చేశారు అని ప్రచారం జరుగుతుంది. అయితే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం నిజంగానే అది నిజమేగా అంటూ నాగబాబుని ఏకిపారేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ వార్ పిక్స్ కి చేరుకుంది . ఈ పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుంది..!!