“ఆ విషయంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా గ్రేట్ “..కాళ్లకు దండం పెట్టాల్సిందే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. కాగా రీసెంట్ గానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లేజినోవాతో కలిసి మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు .

హెలికాప్టర్ లో వచ్చి మరి పవన్ కళ్యాణ్ ఓటు వేశారు . కాగా ఆ టైంలో అన్నా లేజినోవా ప్రవర్తించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది . మనందరికీ తెలిసిందే అన్నా లేజినోవా మన ఇండియన్ కాదు.. రష్యన్ ..వాళ్ళ పద్ధతులు సాంప్రదాయాలు కల్చర్ వేరేగా ఉంటుంది . మన కల్చర్ వేరేగా ఉంటుంది . అయితే పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఇండియన్ సాంప్రదాయాన్ని ఫాలో అవుతుంది అన్నా లేజీనోవా.

కాగా పద్ధతిగా చీర కట్టుకొని సింపుల్ మంగళసూత్రంతో చాలా చక్కగా ట్రెడిషనల్ గా కనిపించింది . ఒక రష్యన్ ఈ విధంగా ఇండియన్ ట్రెడిషన్ ని ఫాలో అవ్వడం నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు . పవన్ కళ్యాణ్ భార్య ఆ విషయంలో చాలా చాలా గ్రేట్ అంటూ పొగిడేస్తూ ఆ విషయంలో ఆమె కాళ్ళకు దండం పెట్టాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు . అక్కడ వాళ్ళ అందరికీ కూడా నమస్కారం చేస్తూ చాలా పద్ధతిగా బిహేవ్ చేసింది పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా..!!