నేను చేసుకోబోయే వాడికి ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలి.. జాన్వి కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయంతో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మత్తెక్కించి కళ్ళతో కుర్ర‌కారును ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో యూత్ కు హీటెక్కించే ఈ చిన్నది.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇంకా తెరపైకి రాకముందే.. జాన్వి కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది.

Mr & Mrs Mahi song Dekhha Tenu launch: Janhvi Kapoor talks about the  perfect man of her dreams

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక ఇటీవల ” మిస్టర్ అండ్ మిసెస్ మాహీ ” సినిమాలో నటించిన జాన్వి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు కాబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి వివరించింది. ఈ ఈవెంట్లో మీడియాతో .. మూవీ టీం ముచ్చ‌టించారు. ఇందులో భాగంగా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది జాన్వి. మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆమె దానికి స్పందించింది. నా కలలను తన కలలుగా భావించి.. నన్ను ఎదగనిచ్చేవాడు.. నాకు సంతోషాన్ని కల్పించేవాడు.. నన్ను నవ్వించే వ్యక్తి..

Happy Birthday Janhvi Kapoor: Times When She Spoke About Her Boyfriend  Shikhar Pahariya

ఒకవేళ నేను ఏడుస్తుంటే నీకు అండగా నేనున్నా అంటూ వెన్నంటే నిలబడే వ్యక్తి కావాలి అంటూ వివరించింది. ప్రస్తుతం జాన్వి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక జాన్వి కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిసిల్‌ కుమార్ షిండే మనవడు శికర్ ప్రహరీయాతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కెమెరా కళ్ళకు చిక్కారు. అయితే వీరిద్దరు ప్రేమలో ఉంటున్నారంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై వీరు స్పందించకపోయినా.. తాజాగా జాన్వి కపూర్ కాఫీ విత్ కరణ్‌ షోలో స్పీడ్ డయల్ లిస్టులో తన తండ్రి, చెల్లి తో పాటు శిఖర్ పేరు ఉందని చెప్ప‌డంతో ఈ వార్తల్లో మరింత బలం చేకూరింది.