ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతనే .. తేల్చేసిన తాజా సర్వే..?!

టాలీవుడ్ లో తమ అభిమానించే స్టార్ హీరో, హీరోయిన్లు ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అలా నెంబర్ గేమ్ అనేది ఎప్పుడు ప్రేక్షకులకు ఆసక్తిగానే ఉంటుంది. ఎవరు టాప్.. ఎవరు లోయెస్ట్ తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరులోనే ఉంటుంది. అయితే తమ అభిమాన హీరోనే నెంబర్ వన్ హీరోగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఇలా తాజాగా వర్మిక్స్ సర్వే టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్‌ రిలీజ్ చేసింది. తాజాగా వచ్చిన సర్వే రిజల్ట్ ప్రకారం టాప్ 1 నుంచి టాప్ 10 వరకు స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.

Prabhas doesn't need a moniker like other stars | cinejosh.com

పాన్ ఇండియా లెవెల్లో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న బిజీ లైన‌ప్ ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ టాప్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక‌ ఇప్పటివరకు ఎటువంటి పాన్ ఇండియా సినిమాలను నటించకపోయినా మహేష్ బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ బాబుకు ఆడియన్స్ 2వ స్థానాన్ని కట్టబెట్టారు. ఇక త్వరలోనే మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

అలాగే 3వ‌ స్థానంలో ఎన్టీఆర్, 4వ‌ స్థానంలో అల్లు అర్జున్, 5వ స్థానంలో రామ్ చరణ్, 6వ స్థానంలో పవన్ కళ్యాణ్, 7వ స్థానంలో నాచురల్ స్టార్ నాని, 8వ స్థానంలో రవితేజ, 9వ స్థానంలో చిరంజీవి, 10వ స్థానంలో విజయ్ దేవరకొండ చోటు దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ లిస్ట్ నెటింట వైరల్ అవడంతో ప‌లువురు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టాప్ త్రీ లో ఒక్క మెగా హీరో కూడా లేకపోవడం ఏంటి అంటూ.. అస‌లు ఆ లిస్ట్‌లో బాల‌య్య లేక‌పోవ‌డం ఏంటి అంటూ.. ఇదంతా అన్ ఫైర్ లిస్ట్ అంటూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.