బన్నీ చేసిన పనికి చిరంజీవి సీరియస్.. కోపంతో ఏం చేశాడంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బన్నీ చేసిన తప్పుకు సంబంధించిన వార్తలను ఎలా ట్రెండ్ చేస్తున్నారో మెగా అభిమానులు చూస్తున్నాము. మరీ ముఖ్యంగా కొంతమంది బన్నీని ఐకాన్ స్టార్ అని కూడా మర్చిపోయి దారుణాతి దారుణమైన పదాజాలంతో దూషిస్తున్నారు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టడమే దానికి కారణం అంటూ తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్టివ్ గా ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత నంద్యాల క్యాండిడేట్ వైసిపి నేత శిల్పా రవికి సపోర్ట్ చేయడమే ఇప్పుడు బన్నీకి పెద్ద తలనొప్పిగా మారింది.

మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంపై సంచలన ట్వీట్ చేయడం కూడా బన్నీకు పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది . అంతేకాదు చిరంజీవి కూడా బన్నీ చేసిన పనిపై సీరియస్ గా ఉన్నాడట . గత కొన్ని నెలలుగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న బన్నీకు హెడ్ వెయిట్ పెరిగింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ ని అవమానించడంతో చిరంజీవి చాలా చాలా సీరియస్ అయ్యాడట .

మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ని తీసేయాలి అనే అంత కోపంగా ఉన్నారట . ఇకపై మెగా హీరోలు ఎవరు కూడా బన్నీకి సపోర్ట్ చేయకుండా ఉండేలా చిరంజీవి సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకున్నారట . ఇదంతా కోపంలో తీసుకున్న డెసిషన్ అంటూ తెలుస్తుంది . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . అయితే చిరంజీవి దీనిపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం..!!