ఊహించని చిక్కుల్లో లావణ్య త్రిపాఠి.. మెగా కోడలు ఇలా అడ్డంగా దొరికిపోయింది ఏంటి..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం మొదట్లో పవన్ కళ్యాణ్ . కాగా ఇప్పుడు లావణ్య త్రిపాఠిని సొంత ఫాన్స్ చేత హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొనేలా చేసుకున్నింది. మనకు తెలిసిందే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ .

మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది . అయితే లావణ్య త్రిపాఠి మొదట ఆయనకు సపోర్ట్ చేయలేదు. ఆవకాయ పచ్చడి గురించి పెట్టిన పోస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ లావణ్యను ఏకేశారు . అయితే ఫైనల్లీ లావణ్య త్రిపాఠి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టేసింది . అయితే ఇప్పుడు మరోసారి కొత్త చిక్కుల్లో పడింది లావణ్య అంటూ ప్రచారం జరుగుతుంది .

దానికి కారణం ఆమె పచ్చడి పెడుతూ జుట్టుని లూస్ గా వదిలేసుకోవడమే. దీంతో అత్తమ్మస్ కిచెన్ వాళ్ళు ఇలా నాణ్యతలేని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా..? జుట్టు అలా వదిలేసారు.. హాండ్స్ కి గ్లౌజెస్ లేవు.. మీరు ఇలా ఎలా చేయగలరు ..? అంటూ అత్తమ్మ కిచెన్ బిజినెస్ పై దెబ్బకొట్టేందుకు చూస్తున్నారు కొందరు జనాలు . దీంతో అత్తమ్మ కిచెన్ టీం స్వయంగా స్పందించింది . అది వాళ్ళు అమ్మడానికి చేసిన పచ్చడి కాదు ఇంట్లో వాడుకోవడానికి చేసిన పచ్చడి అంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది . అయినా సరే సోషల్ మీడియాలో కొంత మంది లావణ్య ని ట్రోల్ చేస్తున్నారు..!