ఆ ఆఫ‌ర్ కావాలంట్ నైట్ ప‌క్క‌లోకి ర‌మ‌న్నారు.. వెంక‌టేష్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..?!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్టార్ నటీమణులు, హీరోయిన్స్‌ సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించారు. అలాగే పలు ఇంటర్వ్యూలో వారికి జరిగిన చెడు సంఘటన గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల వారి కెరీర్ నాశనం అయిపోయిందంటూ.. అవసరాన్ని అవకాశంగా తీసుకొని కమిట్మెంట్ల కోసం వేధించే బ్యాచ్ కూడా ఉన్నారంటూ చాలామంది వివరించారు. కాకపోతే చాలామంది ఫెడ్ అవుట్ అయిన తర్వాత లేదా.. కెరీర్‌ డౌన్ ఫాల్ అయిన‌ టైం లో ఇలాంటి విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లు ఎవరు ఇలాంటి కామెంట్స్ చేసిన సందర్భాలు లేవు.

Suchitra Pillai - Challenge accepted @reshmabl ! ❤️😘 #blackandwhitephotography 📷 @vivek.madaan 🙏 | Facebook

ఇప్పుడు కూడా సుచిత్ర పెళ్ళై అనే ఫేడ్ అవుట్ దశ‌లో ఉన్న నటి కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులభం కాదని.. అందమైన అమ్మాయిలకి అయితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ వివరించింది. కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తాయని.. ఇంకొంతమందికి రాకపోవచ్చు.. వారికి అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఏదో ఆశించి ఆఫర్ చేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. నువ్వు చూడడానికి చాలా గంభీరంగా అనిపిస్తావు అంటూ ఉంటారు. అందుకేనేమో బహుశా నాకు అలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఎవరైనా అడగాలన్న నా మొఖం చూసి వారు భయపడతారు.

Suchitra Pillai from TV actress to Bollywood

అయితే సౌత్ నుండి నాకు ఓసారి.. సినిమాలో అవకాశం వస్తే నటిస్తారా అంటూ కాల్ వచ్చిందని.. అందుకు నేను ఓకే చెప్పానంటూ వివరించింది. ఆ తర్వాత అతను ఈ పెద్ద సినిమాలో ఛాన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది.. నైట్ కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని నన్ను అడిగారని.. దాంతో నాకు కోపం వచ్చి వెంటనే అతని ఎడాపెడా తిట్టి పడేసానంటూ వివరించింది. ఇంకోసారి ఇలా ఫోన్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని చివాట్లు పెట్టానంటూ వివరించింది. మళ్లీ అతను నాకు కాల్ చేయలేదు.. న‌టిగా నాకున్న గుర్తింపు చాలు. అలాంటి దారిలో వెళ్లడం నాకు ఇష్టం లేదంటూ ఆమె వివరించింది. ఇక సుచిత్ర పెళ్ళై రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్ కు జంటగా నటించిన సంగతి తెలిసిందే.