” దేవర ” డైరెక్టర్ పై కన్నేసిన షారుఖ్.. భారీ స్కెచే వేశాడే..?!

బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్‌కు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్ళుగా ఏమాత్రం ఫామ్ లో లేని షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ వరుసగా మూడు సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకుని రికార్డ్స్ సృష్టించాడు. పఠాన్, జవాన్, ఢంకీ సినిమాలతో సక్సెస్ అందుకున్న షారుఖ్.. ఫామ్ లోకి వస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అవుతుందో ఫ్యాన్స్ కు చూపించాడు. ప్రస్తుతం షారుక్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అట్లీతో జవాన్ సినిమా చేసిన షారుక్.. మళ్లీ సౌత్ డైరెక్టర్స్‌తో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

Latest update on Devara first single | Latest Telugu cinema news | Movie  reviews | OTT Updates, OTT

ఈసారి సౌత్ నుంచి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట షారుక్. రైటర్ నుంచి డైరెక్టర్గా మారిన కొరటాల శివ మిర్చి నుంచి ఆచార్య వరకు ప్రతి సినిమాతో తన సత్తా చాటాడు. చివరిగా వచ్చిన ఆచార్య ప్లాప్ అయిన మళ్లీ ఎన్టీఆర్ తో దేవర తెరకెక్కించి తన స్టామినా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎన్టీఆర్ తో గతంలో జనతా గ్యారేజ్ సినిమా తెర‌కెక్కించిన కొరటాల శివ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.

Jawan: Atlee Says Working With Shah Rukh Khan Is Like Living The Dream He  Always Dreamt Of: "From Reading Tales Of Kings To Embarking On A Journey  With One"

దీంతో ఈ హిట్ కాంబో నుంచి వస్తున్న దేవ‌ర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా అగ‌స్ట్ 10న‌ పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర తర్వాత కొరటాల శివ, విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయనున్నాడని టాక్. ఈలోగా షారుక్ ఖాన్, కొరటాల శివ తో పనిచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. షారుక్ తో కొరటాల శివ కాంబో ఫిక్స్ అయితే మాత్రం సినిమా బాక్సాఫీస్ ను బ్లాస్ట్‌ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.