ఆర్ సి 16 లో బాలీవుడ్ స్టార్ హీరో.. బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ అదుర్స్..?!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస‌ సినిమాలు లైన్లో పెట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాతో రిలీజ్ కు సిద్ధమవుతున్న చరణ్.. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తన 16వ‌ సినిమా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇప్పటికీ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. గేమ్ చేంజర్‌ సినిమా పూర్తి అయిన వెంటనే రాంచరణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఇక చరణ్ సెట్స్‌ పైకి వచ్చే లోపే బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొత్తం పూర్తి చేసేయాలని ఉద్దేశంతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

RC 16 launching ceremony: Janhvi Kapoor, Ram Charan, Chiranjeevi, and others join grand pooja ceremony | Watch | Mint

ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు ఈ సినిమాను ఎలా తీస్తాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్, మ్యూజిక్ డైరెక్టర్గా ఏ ఆర్ రెహమాన్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ దిగ్గజ నటుడు నటిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ బాలీవుడ్ న‌టుడు మ‌రెవ‌రో కాదు సీనియర్ యాక్టర్ అమితాబచ్చన్ ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇలాంటి క్రమంలో ఆయన క్యారెక్టర్ ఏంటి అనే అంశంపై మాత్రమే ఇంకా క్లారిటీ రాలేదు.

Amitabh Bachchan - Simple English Wikipedia, the free encyclopedia

దీంతో సినిమాలో అమితాబ్ ఏ రోల్ చేయబోతున్నాడని సందేహాలు ప్రేక్షకుల్లో మొదలు అయాయ్యి. ఇక ఈ సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. కల్కి సినిమాలో కూడా అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఈ సినిమాలో కూడా ఆయన్ని భాగం చేసి తన ద్వారా సినిమా మార్కెట్ ను మరింత పెంచుకునే విధంగా ప్లాన్ చేశాడట బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటి వైరల్ అవడంతో బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్.