సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ విషయంలో నటికి నటికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు చాలా తక్కువగా రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలామంది హీరోయిన్స్ కూడా కొన్ని సందర్భాల్లో బయటపెట్టారు. ఒకోసారి హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్తో ఏకంగా 10 సినిమాలు ప్రొడ్యూస్ చేయవచ్చు అని గతంలో పలు కామెంట్స్ కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోతున్నాయి. హీరోలతో సమానంగా హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ విషయం మాత్రం నెటింట తెగ వైరల్ గా మారుతుంది.
భారతదేశంలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్గా ఈమె పాపులారిటీ సంపాదించుకుంది. తన సినిమాకు దాదాపు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పటికీ మేకర్స్ కూడా ఆమెతో సినిమా చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆలియా భట్, దీపికా పదుకొనే, నయనతార, సాయి పల్లవిను కూడా దాటేసి భారీ పాపులారిటీతో దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక స్టార్ హీరోయిన్. కొన్ని నివేదికల ప్రకారం ఓ ఈవెంట్ లేదా వెబ్ సిరీస్‌కు రూ.14 నుంచి రూ.40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.
డిఎన్ఎ నివేదికల ప్రకారం రస్సో బ్రదర్స్ నిర్మించిన సిటాడెల్ సిరీస్‌లో రీఛార్జ్ మాడెన్‌తో కలిసి నటించిన ప్రియాంక.. ఈ సిరీస్ కోసం రూ.40 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. భారత దేశంలో ప్రాజెక్టుల కోసం ఆమె రూ.14 నుంచి రూ.20 కోట్ల వరకు వసూలు చేస్తుందట. ఇక గతంలోనూ ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని.. కానీ మొట్టమొదటిసారి కెరీర్లో ఒక హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నానని వివరించింది. అదే సిటాడెల్ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం ఫైటర్ సినిమా కోసం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుందట ఈ ముద్దుగుమ్మ.