నాని సినిమాకు సమస్యలు.. ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్టేనా..?!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వ‌రుస‌ సినిమాలతో బిజీగా గ‌డుతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న నాని చేయాల్సిన సినిమాలు లైన్ అప్ భారీగా ఉంది. ఇక గ‌తేడాది హాయ్ నాన్న‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు వివేకా ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాహో ఫేమ్.. డైరెక్టర్ సుజిత్ తో నాని ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కాగా ఇప్పుడు నాని, సుజిత్ సినిమా ప్రారంభం కాకముందే సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది. నానితో భారీ రేంజ్‌లో యాక్షన్ మూవీ తీసేందుకు దర్శకుడు సుజిత్ ప్లాన్ చేసుకున్నాడు. స్క్రిప్ట్‌ నచ్చడంతో నాని కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే డివివి ఎంటర్టైన్మెంట్ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. కానీ బడ్జెట్ అంచనాలు భారీగా పెరగడంతో సినిమా మొదట్లోనే సమస్యలు వచ్చినట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. నాని సినిమా కోసం డైరెక్టర్ సుజిత్ ప్రొడ్యూసర్‌ను భారీ బడ్జెట్ అడగడంతో ఈ సినిమా కోసం ఆ స్థాయిలో ఖర్చు చేసేందుకు దానయ్య ఆలోచనలో పడ్డారట‌.

#Nani32 - Announcement Video | NANI | Sujeeth | DVV Danayya

ప్రస్తుతం నాని మార్కెట్‌ను బట్టి ఆ బడ్జెట్ చాలా ఎక్కువ అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆ స్థాయిలో రెమ్యునరేషన్ వెచ్చించేందుకు ముందుకు రావడం లేదట ప్రొడ్యూసర్. ఇలా బడ్జెట్ అంచనాలు భారీగా ఉండడంతో.. వీరిద్దరి సినిమా మొదట్లోనే ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై డైరెక్టర్, మేకర్స్ మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందట. ప్రస్తుతానికి ఈ మూవీ హోల్డ్ లో ఉందని సమాచారం. మరి నాని, సుజిత్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందో లేదో వేచి చూడాలి.