కమ్యూనిస్టులతో కలిసే..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే అభ్యర్ధుల ఎంపికపై కే‌సి‌ఆర్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఎండింగ్‌కు వచ్చిందని తెలిసింది. దాదాపు సిట్టింగులకే సీట్లు ఫిక్స్ అవుతున్నాయని తెలిసింది. ఇక బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలక్ సీటు ఇవ్వకూడదని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారు.

ఇక వారు జంప్ అవ్వకుండా..అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. అటు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట బి‌ఆర్‌ఎస్ ఆచి తూచి అడుగులేస్తుంది. అవసరమైతే కాంగ్రెస్ నుంచి బలమైన నాయకులని తీసుకోవాలని చూస్తుంది. ఇదే సమయంలో కమ్యూనిస్టుల పొత్తు విషయంలో కే‌సి‌ఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిసింది. మునుగోడు ఉపఎన్నికలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలతో బి‌ఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంది. కమ్యూనిస్టుల మద్ధతు ఉండటం వల్లే బి‌ఆర్‌ఎస్ 10 వేల ఓట్లతో గెలవగలిగింది. అయితే రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో కమ్యూనిస్టులకు కాస్త పట్టు ఉంది.

సొంతంగా గెలిచే బలం లేదు గాని..గెలుపోటములని ప్రభావితం చేయగలరు. అందుకే వారిని కలుపుకుంటే కనీసం 10 స్థానాల్లో లబ్ది పొందే ఛాన్స్ ఉంటుందని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో పొత్తు ఉంటే సి‌పి‌ఐ, సి‌పి‌ఎం ఒక్కో అసెంబ్లీ సీటు, అలాగే ఒక్కో ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది.

కానీ కమ్యూనిస్టులు రెండేసి సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. భద్రాచలం, మిర్యాలగూడ, మునుగోడు, బెల్లంపల్లి సీట్లలో ఏదొక ఒక సీటు చొప్పున సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలకు ఇవ్వాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి పొత్తు ఉంటే సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలకు ఏ సీట్లు దక్కుతాయో.