విశ్వా చేసిన ఆ పని వల్లే నేను నీతోనే డ్యాన్స్ షో మానేశా.. బిగ్ బాస్ నేహా షాకింగ్ కామెంట్స్..?!

ప్రస్తుతం బుల్లితెరపై ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ అదిరిపోయే షోలను ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీలలో కూడా పలు షోలు వైరల్ కావడంతో టెలివిజన్ షోల పై ఆసక్తి తగ్గకూడదనే ఉద్దేశంతో మరింత క్రేజీగా ఆలోచించి డిఫరెంట్ షోలతో ప్రేక్షకులను మెప్పించేందుకు శ్రమిస్తున్నారు మేక‌ర్స్‌. ఈ నేపథ్యంలో స్టార్ మా నీతోనే డ్యాన్స్ షో ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో లో పాల్గొన్న.. అలాగే సీరియల్స్ లో సందడి చేసిన ఎంతోమందిని ఈ షో ద్వారా ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం అవుతున్నారు. ఈ డ్యాన్స్ షో వారితో చేయిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే సీరియల్ యాక్టర్ విశ్వ కు జోడిగా నేహా చౌదరి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న వీరిద్దరూ జోడిగా తమ డ్యాన్స్ తో ప్రేక్షకులను వేరే లెవెల్ లో ఆకట్టుకుంటున్నారు.

Anchor Neha (@chowdaryneha) • Instagram photos and videos

అయితే తాజాగా ఈమె షో నుంచి తప్పుకుంది. నేహా దీనికి గల కారణాలను తాజాగా వివరించింది. అదేంటో ఒకసారి చూద్దాం. నేహ చౌదరి మొదటి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వాస జోడిగా మారి అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరూ పెయిర్గా కొనసాగుతున్నారు. అయితే ఒక్కసారిగా నేహా షో నుంచి తప్పుకోవడం.. ఆమె ఎందుకు తప్పుకుందో.. అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున వినిపించాయి. ఏమైంది.. ఎందుకు.. నాతో చేయట్లేదు అని అభిమానులు ప్రశ్నించడంతో.. వారి బాధను అర్థం చేసుకున్న నేహా తాజాగా దీనిపై స్పందించింది. ఈ డ్యాన్స్ షో ప్రాక్టీస్ చేస్తుండగా చాలా సార్లు చాలా దెబ్బలు తగిలాయని.. వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించింది.

Anchor Neha (@chowdaryneha) • Instagram photos and videos

చాలా రోజులుగా తనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అస్సలు పనిచేయట్లేదు అంటూ వివరించింది. నొప్పి విపరీతంగా ఉంటుందని.. ఇది అర్థం చేసుకున్న విశ్వా నువ్వు కచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాలని పట్టుబట్టాడంటూ.. ఆసుపత్రికి వెళ్లే వరకు ఊరుకోలేద‌ని.. అలా ఆసుపత్రికి వెళ్ళిన తనకు చేయంత దెబ్బతిన్నట్లు వైద్యులు వివరించారని. ముఖ్యంగా 6 వారాలపాటు పూర్తి రెస్ట్ మెడలు ఎటు తిప్పకూడదని.. చేతిని అసలు కదపకూడదని వైద్యులు వివరించారని.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటూ వారు చెప్పినట్టు వివరించింది. దీంతో ఆమె డ్యాన్స్ షో చేయడం మానేయాల్సి వచ్చిందని వివరించింది. దీంతో ఈషోలో నయని పావని పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Anchor Neha (@chowdaryneha)