త్రివిక్రమ్ – బన్నీ కాంబో కోసం రంగంలోకి ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. తను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో ప్రేక్షకులకు మ‌రింత ద‌గ్గ‌ర‌ అయ్యాడు. ఇక చివరిగా మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన మేరకు సక్సెస్ అందుకోలేదు. దీంతో ఆయనపై నెగటివ్ కామెంట్స్ వెలువ‌డ్డాయి. ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

Allu Arjun-Trivikram exciting update tomorrow | cinejosh.com

ఈ క్రమంలో త్రివిక్రమ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ తెర‌కెక్కించిన అన్ని సినిమాలు ఒకే ఫార్ములాతో తెరకెక్కుతున్నయంటూ కామెంట్లు వినిపించాయి. అయితే గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత వెరైటీ కంటెంట్ సినిమా చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తుం.ది మొత్తానికి ఈ సినిమాతో మరోసారి త్రివిక్ర‌మ్ త‌న సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన చేసిన అన్ని సినిమాల కంటే వైవిద్యమైన కథ రూపొందించి బ్లాక్ బాస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడని తెలుస్తుంది.

Who is more beautiful: Kriti Sanon or Pooja Hegde? - Quora

ఇలాంటి నేపథ్యంలో డిఫరెంట్ కథతో త్రివిక్రమ్ ప్రేక్షకులను మెప్పిస్తాడా.. అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అయితే త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు పూజ హెగ్డే, మరొకరు బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్‌ అని టాక్‌. బన్నీ, త్రివిక్రమ్ కాంబో ఈసారి ఇద్దరు స్టార్ హీరోయిన్లతో తెరకెక్కుతుందని తెలియ‌టంతో ఫ్యాన్స్‌లో అంచ‌నాలు పెరిగాయి. ఇక త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో కూడా బన్నీకి సక్సెస్ వచ్చిందంటే.. ఆయనను మించిన స్టార్ హీరో మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చూడాలి ఈ సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..!!