వావ్.. రష్మిక మందన లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ తెలుసా.. అందరూ ఫిదా అవ్వాల్సిందే..?!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మంద‌న‌కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. చివరిగా తెరకెక్కిన యానిమల్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుంది. పుష్పతో శ్రీవల్లి, యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. అల్లు అర్జున్.. సూకుమార్‌ కాంబోలో వస్తున్న పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా తాజాగా మరో పాన్ ఇండియన్ మూవీ కుబేర షూటింగ్లో జాయిన్ అయింది రష్మిక మందన.

Pushpa 2: The Rule makers wish Rashmika Mandanna on her birthday; unveil  her look from Allu Arjun starrer sequel : Bollywood News - Bollywood Hungama

ఓవైపు వరుస‌ సినిమాలతో బిజీగా గడుపుతున్నా.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. నిత్యం లేటెస్ట్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేసుకుని ఈ అమ్మడు నటన పరంగానే కాదు టాలెంటెడ్ బ్యూటీగా మరో విద్య లోనూ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం రష్మిక పాత వీడియో ఒకటి నెటింట‌ వైరల్ గా మారింది. ఇందులో నేషనల్ క్రష్ స్పానిష్ ఆమ్లెట్ వేస్తూ కనిపించింది. ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని వివరిస్తా అంటూ ఆమె ఆ వీడియోని చేసింది.

WATCH: Rashmika Mandanna's egg omelette recipe; here's how you can cook it  at home | PINKVILLA

నువ్వుల నూనె, నెయ్యి, బచ్చల కూర, పుట్టగొడుగులు, టెరియాకి సాస్ లాంటి సాధారణ పదార్థాలను ఉపయోగించి ఆమ్లెట్ వేసి చూపించింది. అయితే ఆమె చేసిన వీడియో నెట్టింట మరోసారి వైరల్ అవుతుండడంతో నేషనల్ క్ర‌ష్ వంట చేయడం ఆశ్చర్యంగా ఉందని.. చిన్న చిన్న హీరోయిన్స్ కూడా వంటగదికి చాలా దూరంగా ఉంటున్నారని.. అలాంటిది నేషనల్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న రష్మిక వంట గదిలో తానే స్వయంగా వంట చేసుకుంటూ ఆ వీడియోని షేర్ చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కుక్కింగ్ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు.