ఎన్టీఆర్ నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ నా బయోపిక్ సినిమా.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..?!

స్టార్ ఆస్ట్రాలజర్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్న వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల వేణు స్వామి పెద్ద ఎత్తున నెటింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. జ్యోతిష్యుడుగా ఎన్నో సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించిన ఈయన.. గత కొంతకాలంగా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ మరింత పాపులారిటీ ద‌క్కించుకుంటున్నాడు. పలు సందర్భాల్లో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై నెగటివ్ కామెంట్స్ చేసి పలు ట్రోల్స్ కు గురవుతున్నారు.

అయినప్పటికీ పట్టించుకోకుండా తాను చెప్పినవి నిజమౌతాయని.. కాస్త ఆలస్యమైనా అది జరగడం ఖాయం అంటూ విమర్శకులను ఖండిస్తున్నారు. అయితే తాజాగా వేణు స్వామి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాల్లో ఒక సూపర్ హిట్ సినిమా తన బయోపిక్‌గా తెరకెక్కిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. డైరెక్షన్లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన అదుర్స్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చారి, నరసింహ అనే రెండు క్యారెక్టర్లలో నటించి మెప్పించాడు.

Jr NTR in 'Adhurs'

కాగా ఈ సినిమా గురించి వేణు స్వామి మాట్లాడుతూ వినాయక్‌ ఈ సినిమాని నా బయోపిక్ గా తీశారని వివరించాడు. ఇందులో రెండు పాత్రలు నావే అంటూ వివరించిన వేణు స్వామి.. ఈ సినిమా పూజా కార్యక్రమాలను తానే చేసినట్టు వివరించాడు. ఆ టైంలో ఎన్టీఆర్ కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందని.. అప్పుడే నేను ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పానంటూ వివరించాడు. ఈ క్రమంలో వేణు స్వామి అదుర్స్ సినిమా గురించి మాట్లాడుతూ అది నా బయోపిక్ అని చెప్తున్నా కామెంట్స్ ప్రస్తుతం నటింట‌ వైరల్ మారడంతో నెటిజ‌న్స్‌ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.