ఆ యంగ్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్.. సినిమా హిట్ అయ్యేనా..?!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకసారి ఎవరైనా డైరెక్టర్‌ను నమ్మితే ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని సంగతి అందరికీ తెలుసు. నాగార్జున ఇటీవల నా స్వామి రంగా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని తమిళ ప్రాజెక్టులతో బిజీగా అయ్యాడు నాగ్. కాగా నా సామిరంగా డైరెక్టర్ విజయ్ బిన్నీతో నాగార్జునకు మరో అవకాశం వ‌చ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక డైరెక్టర్ ను నమ్మితే మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తాడనడానికి ఇదే ప్రూఫ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జునకు విజయ్ బిన్ని మరో హిట్ అందిస్తారా.. లేదా.. వేచి చూడాలి.

Vijay Binni: దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని.. ఏకంగా  నాగార్జునతో సినిమా-naa saami ranga director vijay binni about nagarjuna and  mm keeravani ,ఎంటర్‌టైన్‌మెంట్ ...

అయితే కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ బిన్ని దర్శకుడుగా మరిన్ని సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధిస్తాం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే విజయ్ బిన్ని తన నెక్స్ట్ మూవీ కోసం సొంత కథ ఎంచుకుంటారా.. లేదా రీమేక్ మూవీతో తెర‌కెక్కిస్తారా అనే విషయంపై సందేహాలు మొదలయ్యాయి. ఇక నాగ్‌కు తమిళ్‌లో కుబేర, కూలి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత నాగ్‌ విజయ్ బిన్ని డైరెక్షన్లో సినిమాను నటించనున్నాడని తెలుస్తోంది.

Naa Saami Ranga First Look & Title Glimpse | Nagarjuna Akkineni | Vijay  Binni | Srinivasaa Chitturi

అయితే వీరిద్దరు కాంబోలో వచ్చే ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. త్వరలో ఈ కాంబో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందేమో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నాగార్జున స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో నటించాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక అభిమానులు అక్కినేని హీరోల నుంచి మరిన్ని మల్టీస్టారలు వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం నాగార్జున రెమ్యూనరేషన్ రూ.10 కోట్లు మించి ఉంది.