బర్త్ డే నాడు ఫాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన సమంత.. తాలిబొట్టుతో దర్శనమిచ్చిన స్టార్ బ్యూటీ..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈ ముద్దుగుమ్మ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి కోలుకుంటున్నాను ఈ అమ్మ‌డు మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నాల్లో బిజీ అయింది. పలు యాడ్ షూట్స్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న‌ ఫ్యాన్స్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ ఇస్తుంది. సినిమాల్లోకి రి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ప‌లు పోస్ట్లు షేర్ చేయడంతో దానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించింది.

అయితే ఈ అమ్మడు సినిమా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూనే మ‌రోప‌క్క ఓన్ ఫోడ్‌ కాస్ట్ మొదలెట్టి అందులో హెల్త్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇక నేడు సమంత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు కుప్పలు తిప్పలుగా విషెస్ తెలియజేస్తున్నారు అభిమానులు. ఈ స్పెషల్ డే కు శ్యామ్ ఏదో ఒక మూవీ అప్డేట్ వస్తే బాగుండ‌ని ఫ్యాన్స్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సమంత అభిమానులకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. నిర్మాతగా మారి మొదటి సినిమాను ప్రకటించింది. తన నిర్మాణ సంస్థలో సమంతనే హీరోయిన్గా ఫస్ట్ సినిమాను తెరకెక్కించనుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివిల్ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది.

మా ఇంటి బంగారం టైటిల్ తో సినిమా రానున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ పోస్టర్‌లో సమంత రెడ్ కలర్ చీరతో, మెడలో తాళిబొట్టు, గాజులు, బొట్టు తో ప‌వ‌ర్ ఫుల్ ఇల్లాలిగా దర్శనమిచ్చింది. తుపాకీ చేతిలో పట్టుకొని సీరియస్గా చూస్తూ ఉన్న ఆ లుక్ చూసి ఫ్యాన్స్ అంత షాక్ అయ్యారు. అయితే ఈ పోస్టుకు బంగారమయం కావాలంటే అన్ని మెరవాల్సిన అవసరం లేదు అంటూ ట్యాగ్ చేసింది ఈ అమ్మ‌డు. ప్రస్తుతం సమంత పోస్ట్ నెటింట వైరల్‌గా మారడంతో ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులంతా సమంత రీ ఎంట్రీ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెర‌కెక్కుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన డైరెక్టర్, కాస్టింగ్ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)