వాట్.. మందారం టీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తప్పక తెలుసుకోండి..?!

మందారంలో ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలు కలిగి ఉంటాయ‌ని అందరికీ తెలుసు. అయితే ఇది చర్మ, కేశ‌ సౌందర్యానికి ఎంతగానో సహకరిస్తుందని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే మందారం టీ హెర్బల్ టీ గా త్రాగ‌టం శరీరానికి కూడా ఎంతగానో సహకరిస్తుందని చాలామందికి తెలియదు. ఇందులో రిలాక్సింగ్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మందారం ఆంథోసైనిన్స్ ఆంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఈ పూలను ఎండబెట్టి టీని తయారుచేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో క్రిమ్సన్ కలర్ సమృద్ధిగా ఉంటుంది. క్రాన్ బెల్లి ఫ్లవర్ కలిగి ఉన్న ఈ టీ నీ ఎండాకాలం ఐస్‌టీ మాదిరిగా తీసుకోవచ్చు. అయితే నివేదికల ప్రకారం మందారం టి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం.

Health Benefits Of Hibiscus Tea – Forbes Health

మందారం టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. బీటా క్యారెటీన్‌.. ఫ్రీరాడికల్స్ రాకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ రెలీఫ్‌కు సహకరిస్తాయి. మన డైట్ లో మందారం టిని చేర్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ను తగ్గించుకోవచ్చని నివేదికలు వెల్లడించాయి. ఇది కొన్ని క్లినికల్ ట్రైల్స్ తో కూడా నిరూపితమైంది. అలాగే మందారం టీని రోజు తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది కాలేయాన్ని కాపాడడానికి సహకరిస్తుంది. ఈ టీలో ఉండే హైపోటో ప్రొటెక్టివ్ గుణాలు శరీరంలో పేర్కొన్న టాక్సిన్స్ ను బయటకు పంపించి.. కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి. ఈమందర పువ్వులను ఎండబెట్టి తయారు చేసే మందారం టీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ టీని మీరు డైట్ లో చేర్చుకోవడం వల్ల మూడ్‌ స్వింగ్స్ నుంచి బయటపడవచ్చు అని తెలుస్తోంది. ఇందులో అరోమా స్ట్రెస్, యాంగ్జైటీ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది.

How to make Hibiscus Tea with Fresh Flowers - The Organic Gypsy

ఈ కాలంలో విపరీతమైన పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ బారిన పడుతూ ఉంటారు. ఇది వారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని.. మందారటీని డైట్ లో చేర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. రెండు కప్పుల నీటిలో రెండు టేబుల్ స్పూన్లు బాగా ఎండబెట్టిన మందార పులిపొడిని వేసుకుని ఆ నీటిని మరిగించుకుని గోరువెచ్చ‌గా మారిన తర్వాత ఇందులో తేనె వేసి కలుపుకుంటే సరిపోతుంది. అది దీనిని ఐస్టీల తీసుకోవాలంటే ఇందులో కాస్త ఐస్ క్యూబ్స్ జోడించి పుదీనా ఆకులు, నిమ్మ బద్దతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. తప్పక ఈ టీ ని తయారు చేసుకుని ప్రయత్నించడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.